Social News XYZ     

Abhishek Pictures releasing Ramgopal Varma’s Vangaveeti on December 23rd

రామ్ గోపాల్ వ‌ర్మ `వంగ‌వీటి` చిత్రాన్నిడిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చ‌ర్స్

Abhishek Pictures releasing Ramgopal Varma's Vangaveeti on December 23rd

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం వంగ‌వీటి. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ వంగ‌వీటి చిత్రాన్ని డిసెంబ‌ర్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ విడుద‌ల చేస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ వారు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20న వంగ‌వీటి సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున‌లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

 

బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

Facebook Comments