Social News XYZ     

Santha Bhai movie completes 40 percent shooting

నలభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'శాంతాభాయ్‌'

Santha Bhai movie completes 40 percent shooting

నూతన నటుడు మున్నా హీరోగా బిందు అశ్విని, ఉమ హీరోయిన్స్‌గా బేబి సుహాన సమర్పణలో సిద్థార్ధ్‌ కన్నాని దర్శకునిగా పరిచయం చేస్తూ సుధీర్‌ గుండెపూడి శివ నిర్మిస్తున్న కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం 'శాంతాభాయ్‌'. నలభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ కార్యక్రమం డిసెంబర్‌ 15న హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో మున్నా, హీరోయిన్స్‌ బిందు, ఉమ, దర్శకుడు సిద్థార్ధ్‌ కన్నా, నిర్మాత సుధీర్‌ గుండెపూడి శివ, నటుడు రమేష్‌, నటి శ్రేయ, కెమెరామెన్‌ శ్రీరమణ పాల్గొన్నారు.

 

చిత్ర నిర్మాత సుధీర్‌ గుండెపూడి శివ మాట్లాడుతూ - ''కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో సాగే ఈ చిత్రాన్ని వెరైటీ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. 'శాంతాభాయ్‌' మహల్‌లో ఏం జరిగింది? అనేది సస్పెన్స్‌. ఇప్పటి వరకూ వచ్చిన హార్రర్‌ చిత్రాల్లో కంటే విభిన్నంగా వుంటుంది. అందరూ కొత్త నటీనటులతో దర్శకుడు సిద్థార్ధ్‌ కన్నా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీరమణ కెమెరా వర్క్‌ ఈ సినిమాకి ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌గా నిలుస్తుంది. వికారాబాద్‌, హైదరాబాద్‌ సరౌండింగ్స్‌లో షూటింగ్‌ జరిపాం. ఇప్పటివరకూ నలభై శాతం షూటింగ్‌ పూర్తయింది. జనవరి కల్లా సినిమాని పూర్తి చేసి ఫిబ్రవరిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు సిద్థార్ధ్‌ కన్నా మాట్లాడుతూ - ''సంవత్సరన్నర పాటు ఈ చిత్ర కథపై వర్క్‌ చేసాను. సుధీర్‌గారు కథ విని బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. చిన్న సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. 'శాంతాభాయ్‌' అనే పాట చాలా పాపులర్‌ అయ్యింది. నిజ జీవితంలో నేను చేసిన 'శాంతాభాయ్‌' అనే అమ్మాయిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ స్టోరీ రెడీ చేశాను. అతి త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తాం'' అన్నారు.

హీరో మున్నా మాట్లాడుతూ - ''కథ విని చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ముఖ్యంగా 'శాంతాభాయ్‌' టైటిల్‌ విని చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్‌ ఇచ్చిన సిద్థార్ధ్‌ కన్నాకి, సుధీర్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.
హీరోయిన్‌ బిందు మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో నటించాను. 'శాంతాభాయ్‌' పాట ఎంత పాపులర్‌ అయ్యిందో అందరికీ తెల్సు. అలాంటి టైటిల్‌తో మా సినిమా రావడం చాలా సంతోషంగా వుంది. సస్పెన్స్‌, హార్రర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది'' అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: శ్రీరమణ, సంగీతం: సాభు, ఎడిటింగ్‌: వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: చైతన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌,
నిర్మాత: సుధీర్‌ గుండెపూడి శివ,
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు, దర్శకత్వం: సిద్థార్ధ్‌ కన్నా

Facebook Comments

%d bloggers like this: