`గౌతమిపుత్ర శాతకర్ణి` థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్న 100 థియేటర్స్ లిస్ట్
ప్రపంచ సినిమా చరిత్రలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్‌ను 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి
. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 16న కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా వంద థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ సహా టోటల్ టీం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన తర్వాత కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌కు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారు.
This website uses cookies.