కెప్టెన్ చైర్‌లో మెగాస్టార్.. యాక్టింగ్‌లో వినాయక్
దర్శకుడే హీరోని డైరెక్ట్ చేయడం రొటీన్..! హీరోనే దర్శకుడిని డైరెక్ట్ చేస్తే !? .. అది కాస్త డిఫరెంట్!! అది కూడా 150 సినిమాల్లో నటించిన ఓ అగ్ర కథానాయకుడు కెప్టెన్ చైర్‌లో కూచుని.. తన డైరెక్టర్ నటించే సన్నివేశాన్ని తెరకెక్కిస్తే ఇంట్రెస్టింగ్ అనకుండా ఉండలేం. ప్రస్తుతం ఖైదీ నంబర్ 150
సెట్స్‌లో అలాంటి అరుదైన సన్నివేశం ఒకటి కనిపించింది. వి.వి.వినాయక్ ప్రస్తుతం ఆన్‌సెట్స్‌లో ఉన్న ఖైదీ నంబర్ 150
లో ఓ సన్నివేశంలో నటించారు. ఆ సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో ఈ షాట్‌ని మంగళవారం ఉదయం చిత్రీకరించారు.
ఇంతకాలం మెగాస్టార్ నటిస్తుంటే ఆ సన్నివేశాలను డైరెక్ట్ చేసిన వినాయక్ ఇప్పుడిలా నటుడిగా మారిపోవడం... తను నటించే సీన్‌ని అన్నయ్య స్వయంగా డైరెక్ట్ చేయడం.. రేర్ మూవ్‌మెంట్. తన జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చిన సందర్భం. అయితే వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ఠాగూర్
చిత్రంలోనూ ఓ సన్నివేశంలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. మరోసారి ఇలా అరుదైన ఛాన్స్ వినాయక్‌కి దక్కిందన్నమాట! ఈ షాట్‌ని మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ చేయడం ఓ సెన్సేషనే.