After scoring a solid blockbuster with 'Janatha Garage', Young Tiger NTR is all set to begin work on his next project. This prestigious #NTR27 project will be produced by Nandamuri Kalyan Ram on NTR Arts banner and K.S. Ravindra (Bobby), who made his debut with 'Power', is going to direct this movie.
NTR is on a roll after scoring back to back hits with 'Temper', 'Nannaku Prematho' and 'Janatha Garage'. He will once again be seen in a totally new look in this big budget production. The film's formal launch will take place after Sankranthi and regular shooting will commence immediately. The unit is aiming for a release in the second half of 2017.
"I am delighted to produce my brother Tarak's 27th film on our home banner NTR Arts. This big budget project will have the very best technical standards and production values. Director Bobby has come up with an excellent story that does justice to both the actor as well as the star in NTR", said Producer Kalyan Ram.
Other details about the film's cast and crew will be announced soon.
కళ్యాణ్ రామ్ నిర్మాణం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రం ఖరారు
జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ నూతన చిత్రం లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ అనంతరం చిత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. ఆ వెంటనే నిరవధికం గా షూటింగ్ జరుపుకుని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది.
" సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధం గా ఉంది. వచ్చే సంక్రాంతి సెలవుల అనంతరం చిత్రాన్ని ప్రారంభిస్తాం", అని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు.
భారీ తారాగణం తో,విన్నూత్నమైన పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ని నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియ చేయబడతాయి
This website uses cookies.