Mama O Chandamama completes first schedule

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మామ ఓ చంద‌మామ

రామ్‌కార్తీక్‌, స‌నాఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీమ‌తి బొడ్డు ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో ఈస్ట్‌వెస్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై విశాఖ థ్రిల్ల‌ర్ వెంక‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ప్ర‌సాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం మామ‌..ఓ..చంద‌మామ‌. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం
హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో చిత్ర‌యూనిట్ పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో....

న‌వంబ‌ర్ 11న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను ద‌ర్శ‌కుడు పెద్ద వంశీ ఊరు అయిన ప‌స‌ల‌పూడిలో స్టార్ట్ చేశాం. హీరో రామ్‌కార్తీక్‌, స‌నాఖాన్ స‌హా న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల్లోచ‌క్క‌గా న‌టించారు. అలాగే టెక్నిషియ‌న్స్ అందించిన స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేశాం. ఈ నెలాఖ‌రున రెండోషెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తాం. బి.ఎ.రాజుగారి స‌హ‌కారం కూడా మ‌రువ‌లేము. మున్నా కాశీ మంచి మ్యూజిక్ అందించాడు. కుటుంబ విలువ‌ల‌తో కూడిన కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుందని ద‌ర్శ‌కుడు విశాఖ థ్రిల్ల‌ర్ వెంక‌ట్ తెలియ‌జేశారు. సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌గారు ప్ర‌తి సీన్‌ను ఎంతో చ‌క్క‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమాటోగ్రాఫ‌ర్ బాబుగారు కోన‌సీమ అందాల‌ను చ‌క్క‌గా చూపిస్తున్నారు.

ఫిభ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నామ‌ని హీరో రామ్‌కార్తీక్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ మున్నాకాశీ, సినిమాటోగ్రాఫ‌ర్ జి.ఎల్‌.బాబు, ఎడిట‌ర్ మాధ‌వ్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్ కుమార్‌, శ్రీధ‌ర్‌, దీపిక కాక‌ర్ల‌, అనీషా త‌దిత‌రులు పాల్గొన్నారు.

రామ్‌కార్తీక్‌, స‌నాఖాన్‌, అజ‌య్‌ఘోష్‌, కేధారి శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లుః మ‌రుధూరి రాజా, పాట‌లుః శ్రీరాం త‌ప‌స్వి, క‌రుణాక‌ర‌ణ్‌, సంగీతంః మున్నాకాశీ, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ఆర్ట్ః ఉత్త‌ర్ కుమార్‌, డ్యాన్స్ః స‌తీష్ శెట్టి, సినిమాటోగ్ర‌ఫీః జి.ఎల్‌.బాబు, ప్రొడ‌క్ష‌న్ః సుబ్బారావు గూడ పాక‌ల‌, స‌హ నిర్మాతః ముర‌ళి సాధ‌నాల‌, నిర్మాతః వ‌ర‌ప్ర‌సాద్ బొడ్డు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః విశాఖ థ్రిల్ల‌ర్స్ వెంక‌ట్‌.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%