జయలలిత, నేను ఒకే స్కూల్లో చదివాం ; సుమన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల సీనియర్ నటుడు సుమన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హాస్పటల్ నుండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని భావించినట్టు తెలిపారు. జయలలిత మహిళలకు మార్గదర్శి అని అన్నారు. ఆమె, నేను చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో చదివాం. నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నపుడు జయలలిత సీనియర్. ఆమె షూటింగ్ లకు వెళ్ళడం నాకు బాగా గుర్తుంది అని సుమన్ గుర్తుచేసుకున్నారు. నటిగా కంటే మంచి డాన్సర్ గా జయలలిత ప్రసిద్ది. ఎలాంటి నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి జనామోదం పొందిన లీడర్ అయ్యారు. తమిళనాడులో జయలలిత పెట్టిన స్కీమ్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా అమ్మ క్యాంటిన్ లో చవకధరకే ఇచ్చేవారు. ఆడపిల్లలు చదువులో ముందుండాలని ల్యాప్ ట్యాప్ లు ఇచ్చారు. మహిళలకు సైకిళ్ళు, గ్రైండర్స్ , ఫ్యాన్స్ అందజేశారు. ఆమె రాజకీయ జీవితంలో బ్లాక్ మెయిల్ కు ఆస్కారం లేదు. పార్టీలో ఒక స్కూల్ మాస్టర్ గా స్ట్రిక్ట్ గా వ్యవహించేవారు. ఆమెను చూస్తే సివంగి గుర్తుకువస్తుంది. నిర్ణయాలు వెంటనే తీసుకోవడం ఆమె ప్రత్యేకత. జయలలిత బయోగ్రఫీ చూస్తే ఎందరికో ప్రేరణ కలుగుతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని సుమన్ పేర్కొన్నారు.
This website uses cookies.