Social News XYZ     

Director Raghavendra Rao launches Inspector Kiran TV Serial

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ప్రారంభమైన " ఇనిస్పెక్టర్ కిరణ్ "

Director Raghavendra Rao launches Inspector Kiran TV Serial

గంగోత్రి స్టుడియోస్ ప్రై.లి సమర్పణలో సలుకూటి సర్వేష్ రెడ్డి నిర్మిస్తున్న " ఇనిస్పెక్టర్ కిరణ్ " సీరియల్ హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమైంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫేమ్ రోహిణి హీరోయిన్ గా, విశ్వ హీరోగా నటిస్తున్న ఈ సీరియల్ కు కార్తిక్ తవ్వ దర్శకత్వం వహిస్తున్నారు.. హీరోహీరోయిన్ల పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘేంద్రరవు క్లాప్ నిచ్చారు.. కామెడీ నేపధ్యంలో రూపోందుతున్న " ఇనిస్పెక్టర్ కిరణ్ " సీరియల్ ప్రతిరోజు జీ తెలుగు చానల్ లో ప్రసారం కానుంది..ఈ సంధర్భంగా ..

 

నటుడు విశ్వ మాట్లాడుతూ ..
గంగోత్రి స్టుడియోస్ పై రూపోందుతున్న " ఇనిస్పెక్టర్ కిరణ్ " సీరియల్ లో హెడ్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాని అన్నారు.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫేం రోహిణి ఈ సీరియల్ లో ఇన్సిపెక్టర్ రోల్ చేస్తుందని..అమె ప్రక్కన కానిస్టేబుల్ గా నటిస్తున్నందకు ఆనందంగా ఉందని అన్నారు..నిర్మాత సర్వేష్ రెడ్డి నిర్మిస్తున్న మా సీరియల్ ఒపెనింగ్ కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ నివ్వడమే ఫస్ట్ సక్సెస్ గా బావిస్తున్నామని తెలిపారు..జీ తెలుగులో గంగతో రాంబాబు సీరియల్ లో ఆదరించినట్లే ..ఈ సీరియల్ ను కూడా ఆదరించాలని కోరారు..ఈ సీరియల్ ద్వారా అందరిని నవ్విస్తామని ధీమా వ్యక్తం చేశారు..

నటీ రోహిణి మాట్లాడుతూ ...కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తనకెంతో బ్రేక్ ఇచ్చిందని అన్నారు..యాక్సిడెంట్ తర్వాత " ఇనిస్పెక్టర్ కిరణ్ " సీరియల్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు..కామెడీ ,సీరియస్ మంచి ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సీరియల్ రూపోందుతుందని ఆమె తెలిపారు..విశ్వ తో పాటు చాలా మంది సీనియర్ నటీనటులతో నటించే అవకాశం కల్పించినందకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ తెలిపారు.. తమిళ్ లో 6 మెగా సీరియల్స్ చేసిన అనుభవం ఉన్న తవ్వ కార్తీక్ ఈ సీరియల్ ను తెరకెక్కిస్తున్నారని తెలిపారు..

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ రాము వెంకీ మాట్లాడుతూ .. కె రాఘవేంద్రరావు ప్రోడక్షన్ లో వర్క్ చేసిన సలుకూటి సర్వేష్ రెడ్డి గారు గంగోత్రి స్టూడియోస్ పై పలు విజయవంతమైన సీరియల్స్ నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం " ఇనిస్పెక్టర్ కిరణ్ " సీరియల్ ప్రారంభించారు..ఈ సీరియల్ ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందించేందుకు పక్కా ప్లాన్ తో వున్నారని అన్నారు..గతంలో మూడు చిత్రాలు చేసిన అనుభవం ,ముత్యాల ముగ్గు సీరయల్ చేసిన అనుభవం ఉన్న తనకు ఈ సీరియల్ బాద్యతలు ఇచ్చినందకు నిర్మాత సర్వేష్ రెడ్డి కు థ్యాంక్స్ తెలిపారు..మొదటి నుంచి సహాకారం అందిస్తున్న జీ తెలుగు జయంత్ ,అనురాధ గారు ప్రత్యేక థ్యాంక్స్ అన్నారు..మా నటీ నటులు , టెక్నికల్ టీమ్ సక్సెస్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు..

నటీనటులు : విశ్వ ,రోహిణి , బ్యానర్ : గంగోత్రి స్టూడియోస్ ప్రై లిమిటెడ్ , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : రాము వెంకీ , నిర్మాత : సలుకూటి సర్వేష్ రెడ్డి , డైరెక్టర్ : తవ్వ కార్తీక్

Facebook Comments

%d bloggers like this: