అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ స్థాపించిన K M Music Conservatory లో శిక్షణ తీసుకున్న యువ సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్. ఇటీవల తాను సంగీతం అందించిన 'నీవే' మ్యూజిక్ వీడియో సంచలనం సృష్టించింది. తెలుగు,తమిళ్, కన్నడ భాషలలో విడుదలైన 'నీవే' టాలీవుడ్, కోలీవుడ్, సాండల్వుడ్ పెద్దలను అమితంగా ఆకర్షించింది. కేవలం 5 వారాల్లో 2.5 మిలియన్ వ్యూస్ సాధించి దిల్ రాజు, రాజమౌళి వంటి దిగ్గజాల నుంచి మన్ననలను పొందింది.
Crowd funding ద్వారా నిర్మితమైన 'నీవే' కి దర్శకుడు - గోమతేష్ ఉపాధ్యాయ, కళాకారులు - నిరంజన్ హరీష్, శ్రేయ దేశ్ పాండే, గాత్రం - యాజిన్ నిజార్, సమీరా భరద్వాజ్, సాహిత్యం - శ్రీజో
ఇప్పుడు, ఫణి కళ్యాణ్ తన నూతన మ్యూజిక్ వీడియో 'చందమామ' తో వస్తున్నాడు. ఇది డిసెంబర్ 4 న తన youtube ఛానల్ ద్వారా విడుదల కానుంది.
దర్శకత్వం - సాయి ప్రతీక్
కళాకారులు - అర్జున్ కళ్యాణ్, పూజిత పొన్నాడ
గాత్రం - యాజిన్ నిజార్, మానస
సాహిత్యం - వి. వి. రామాంజనేయులు
ప్రోగ్రామింగ్ - వి. ఎస్. భరణ్
'నీవే' సాధించిన అనూహ్యమైన విజయాన్ని మరోసారి 'చందమామ' ద్వారా పొందాలని చూస్తున్న ఫణి కళ్యాణ్ త్వరలో రెండు సినిమాలకు సంగీతం అందించబోతున్నాడు.