Khaidi No. 150 completes talkie part shooting

చివ‌రిపాట చిత్రీక‌ర‌ణ‌లో `ఖైదీ నంబ‌ర్ 150`

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్ సాంగ్‌ను నేటి నుంచి చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట చిత్ర‌ణ‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ-మెగాస్టార్ కెరీర్‌లోనే వెరీ స్పెష‌ల్ మూవీ ఇది. ఓ చ‌క్క‌ని క‌థాంశంతో, విజువ‌ల్ గ్రాండియారిటీతో ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూత్‌ స‌హా కుటుంబ స‌మేతంగా అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రంగా మ‌లిచారు. నిన్న‌టితో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నేటినుంచి రామోజీ ఫిలింసిటీలో శంక‌ర్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో చివ‌రి పాటను తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%