The much-awaited tollywood star comedian sapthagiri hero launching movie Sapthagiri Express on Friday cleared its censor formalities and the board gave a U/A certificate to this comedy and emotional flick. The film, after much deliberation, has been scheduled to hit the screens worldwide in December last week.
The movie is directed by Arun Pawar and produced by Dr K Ravi Kiran under the banner of Sai Celluloid Cinematic Creations Pvt. Ltd. In a bid to make it a big hit at the box office, the makers are leaving no stone unturned in promoting the movie. The audio launch of Saptagiri Express is held in Hyderabad recently.
Power star Pawan Kalyan released its music CD’s at the event, and give his autograph on the first copy. The music for the movie was composed by New Music director Vijay Bulganin. Top technicians from South Indian cinema such as cinematographer ramprasad, film editor gowthamaraju has joined hands for Sapthagiri Express.
సెన్సార్ పూర్తి చేసుకున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఆడియో విడుదల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లహరి వారు ఈ చిత్ర ఆడియోను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
పాటలకి సైతం భారీ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యు/ఏ’ రేటింగ్ తో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, ఫైట్స్ : స్టంట్స్ జాషువా, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.