రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్‌లైన్. ఉదయ్ నాగ్ రతన్ దాస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో మ్యాంగో ఆడియో ద్వారా మార్కెట్ లోకి ఆదివారంనాడు హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, మా
అధ్యక్షులు డా.రాజేంద్రప్రసాద్ తొలి సీడీ ఆవిష్కరించి స్టార్ మేకర్ సత్యానంద్ కు అందజేశారు. అనంతరం డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....ఎంతో మంది హీరోలను తయారు చేసిన సత్యానంద్ `నేత్ర` చిత్రంలో నటించాడని తెలిసి మొదట ఆశ్చర్యపోయాను. వారబ్బాయి కూడా ఈ చిత్రం ద్వారా నటుడుగా పరిచయమవుతున్నాడు. తనకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా. పాటలు విన్నాక సంగీత దర్శకుడికి మంచి సంగీత పరిజ్ఞానం ఉందని తెలుస్తోంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలన్న క్యూరియాసిటీ కలిగింది. కచ్చితంగా చూస్తాను. దర్శకుడు మాటలు, చూసిన ప్రోమోస్ ను బట్టి ప్రతిభాశాలి అని అర్థమవుతోంది. సత్యానంద్ శిష్యులు, ఆయనకు బాగా కావాల్సిన వారంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించాలనీ ఆశిస్తూ...యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు
అని తెలిపారు.
స్టార్ మేకర్ సత్యానంద్ మాట్లాడుతూ...ఇప్పటి వరకు 149 మందిని నటులుగా తీర్చిదిద్దాను. అందులో 95 మంది హీరోలయ్యారు. ఈ సినిమాలో కూడా నా శిష్యులు నటించారు. దర్శకుడు యాదా కుమార్ కూడా నా శిష్యుడే. ప్రభాష్ బ్యాచ్ తను. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. రతన్ గారు వినసొంపైన పాటలు సమకూర్చారు. నేను నా కుమారుడు కలిసి మొదటి సారిగా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా
అన్నారు.
నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో స్నేహితుల సహకారంతో ‘నేత్ర’ చిత్రాన్ని రూపొందించాను. విశాఖ, అరకు, రాజమండ్రి ప్రదేశాల్లో జరిపిన షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ చూశాము. యూనిట్ అంతా కూడా ఎంతో హ్యాపీ. దర్శకుడు చిత్రాన్ని చెప్పిన దానికంటే కూడా ఎంతో బాగా తెరకెక్కించాడు. మా తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా`` అన్నారు.
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్ మాట్లాడుతూ... ‘లవ్ అండ్ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా క్వాలీటీతో నిర్మించారు. ప్రతి విషయంతో నాకు ఎంతో సహకరించారు. హీరో గోపిచరణ్, హీరోయిన్ ఐశ్వర్య వారి నటనతో ఆకట్టుకుంటారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టార్ మేకర్ సత్యానంద్‌గారు, వారి అబ్బాయి కలిసి నటించిన తొలి సినిమా మా నేత్ర
కావడం ఆనందంగా ఉంది. రతన్ గారి సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ పాటలను, సినిమాను విజయవంతం చేసి మా నిర్మాతను నిలబెట్టాలని కోరుకుంటున్నా. మా ఆడియో ఫంక్షన్ కు విచ్చేసి తొలి సీడీ ఆవిష్కరించిన డా.రాజేంద్రప్రసాద్ గారికి నా ధన్యావాదలన్నారు.
నటుడు శివాజీరాజా మాట్లాడుతూ...``నేను కూడా సత్యానంద్ గారి శిష్యుడినే. వారి చేతిలో పడ్డ ప్రతి వారు మంచి స్థాయిలో ఉన్నారు. వారి శిష్యులంతా కలిసి చేసిన ఈ ప్రయత్న సక్సెస్ కావాలన్నారు.
హీరో గోపీచరణ్ మాట్లాడుతూ...``నేను హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. మంచి పాటలు కుదిరాయి. అభిరుచి కలిగిన దర్శక నిర్మాతలతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ...సత్యానంద్ గారి వద్ద యాక్టింగ్ లో శిక్షణ పొందాను. నేను నటించిన సినిమాలో వారు కూడా నటించడం లక్కీగా భావిస్తున్నా
అన్నారు.
సంగీత దర్శకుడు ఉదయ్ నాగ్ రతన్ దాస్ మాట్లాడుతూ...దర్శక నిర్మాతలు సంగీతం పట్ల అవగాహనుండటంతో మంచి బాణీలు రాబట్టుకున్నారు. నటీనటులందరూ కూడా చక్కటి హావభావాలు ప్రదర్శించారు. మా పాటలు విని ఆనందిస్తారని కోరుకుంటున్నా
అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ...``పాటలు బావున్నాయి. ట్రైలర్స్ చూస్తుంటే హర్రర్ కామెడీ సినిమాలా ఉంది. ప్రజంట్ ఈ తరహా చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా వాటి కోవలోకి చేరుకోవాలన్నారు. పాటలు, ట్రైలర్స్ బావున్నాయి. సినిమా విజయంవంతమవ్వాలన్నారు అన్నం రెడ్డి కృష్ణ కుమార్.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
గోపిచరణ్, ఐశ్వర్య హీరో హీరోయిన్‌లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్ సత్యానంద్, ఐకె త్రినాధ్, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్ చరణ్, తిరుమలరెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జనార్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్ రతన్‌దాస్, మాటలు: ప్రసాదుల మధుబాబు, కెమెరా: ఎస్.వి. గోపాల్, ఎడిటింగ్: నర్సింగ్ రాధోడ్, కొరియోగ్రఫి: లుక్స్ రాజశేఖర్, బాలకృష్ణ, ఫైట్స్: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ స్క్రీన్‌ప్లే
దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్.
This website uses cookies.