Social News XYZ     

Nanna Nenu Naa Boyfriends teaser gets a tremendous response

`నేను నా బాయ్ ఫ్రెండ్స్` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌
- బెక్కం వేణుగోపాల్

Nanna Nenu Naa Boyfriends teaser gets a tremendous response

ల‌క్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రం నాన్న‌, నేను నా బాయ్ ఫ్రెండ్స్. మాన‌స‌, మ‌హాల‌క్ష్మి స‌మ‌ర్పిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. రావు ర‌మేశ్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్ బాబు, పార్వ‌తీశం, నోయ‌ల్ సేన్ కీల‌క పాత్ర‌ధారులు. . బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత‌. భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌నే ఆనందంలో ఉన్నారు నిర్మాత‌ బెక్కం వేణుగోపాల్. ఆయ‌న‌ మాట్లాడుతూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఒక చిన్న సినిమా టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో ఈ రేంజ్‌లో హిట్స్ వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. ఈ ఆద‌ర‌ణ‌ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకు ప్రేక్ష‌కులు ఇచ్చిన తొలి దీవెన‌లుగా భావిస్తున్నాం. ఈ నెల 19న పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. డిసెంబ‌ర్ 9న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం.   షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌లో ఉన్నాయి. దిల్‌రాజుకి ఈ సినిమా విప‌రీతంగా న‌చ్చింది. ఆయ‌నే సినిమాను విడుద‌ల చేస్తున్నారు అని తెలిపారు.

కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి కెమ‌రా: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్: విఠ‌ల్ కోస‌న‌మ్, ఎడిట‌ర్: చోటా.కె.ప్ర‌సాద్‌, స్క్రీన్ల‌ప్లే, మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, క‌థ‌: బి.సాయికృష్ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర్ భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, నృత్యాలు: విజ‌య్ ప్ర‌కాశ్‌, స్టంట్స్: వెంక‌ట్‌.

 

Facebook Comments