Social News XYZ     

Jiiva’s Pokkiri Raja to release on November 25th

నవంబర్‌ 12న  వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న
జీవా  25వ చిత్రం ‘పోకిరిరాజా’

Jiiva's Pokkiri Raja to release on November 25th

‘రంగం’వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ మదిలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న జీవా మరోసారి ‘పోకిరి రాజా’తో మన ముందుకు వస్తున్నారు. జీవా హీరోగా గ్లామరస్‌ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్‌గా పి.టి. సెల్వ‌కుమార్‌ సమర్పణలో రామ్‌ప్రకాష్‌ రాయప్ప దర్శకుడుగా టి.ఎస్‌ పొన్‌సెల్వి తమిళంలో నిర్మించిన చిత్రం ‘పోకిరిరాజా’. 2016 మార్చి నెల‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయి జీవా కెరీర్‌లో నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌విఎస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో మలిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ఉసిరికల‌ హనీ ప్రమోద్‌, పి.శ్రీనివాస్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల‌కు అందిస్తున్నారు. కాగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, ఎం.వి.ఆర్‌. ఫిలింస్‌ అధినేత ఎం. వెంకట్రావు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ‘పోకిరిరాజా’ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత ఎం.వెంకట్రావు మాట్లాడుతూ ` ‘‘తమిళంలో రూపొందిన ‘పోకిరిరాజా’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. జీవా పెర్ఫామెన్స్‌, హన్సిక గ్లామర్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ హీరో సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ ముఖ్యపాత్రలో నటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు రొమాన్స్‌ కూడా ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది హైలైట్‌గా నిలుస్తుంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల‌ను కడుపుబ్బ నవ్విస్తుంది. డి.ఇమామ్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో మంచి హిట్‌ అయింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వండర్‌ఫుల్‌గా చేశాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చే గొప్ప సినిమా ఇది’’ అన్నారు.

 

జీవా, హన్సిక మోత్వాని, శిబిరాజ్‌, రామ్‌దాస్‌, మనోబాల‌, మెయిల్‌సామి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమామ్‌, కెమెరా:
అంజి, ఎడిటర్‌: వి.జె. సాబు జోసెఫ్‌,
నిర్మాతలుః మలిరెడ్డి వీరవెంకటసత్యనారాయణ,
ఉసిరికల‌ హనీ ప్రమోద్‌, పి.శ్రీనివాస్‌,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ప్రకాష్‌ రాయప్ప

Facebook Comments

%d bloggers like this: