Aakatayi movie enters last schedule

ఆఖరి షెడ్యుల్లో “ఆకతాయి”

VKA ఫిలింస్పతాకంపై నవ దర్శకుడు రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆకతాయి. ఈ సినిమా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్ లో హీరో ఆశిష్ రాజ్, హీరోయిన్రుక్సార్ మీర్, రాంకీ, సుమన్, నాగబాబు, రాశి, బ్రహ్మానందం, పోసాని, పృద్వీ,శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ లతో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.  అలాగే వైజాగ్ లో RK బీచ్, రామానాయుడు స్టూడియోస్మరియు సిటీలోని కొన్ని అందమైన లొకేషన్స్ లో రెండు పాటలు, కొంత టాకీతో మొత్తం మూడుషెడ్యూల్స్ పూర్తయినట్లు దర్శకుడు రామ్ భీమన తెలిపారు.

నవంబర్ 2 నుండిజరుగుతున్న ఆఖరి షెడ్యూల్ లో ప్రదీప్ రావత్, రాంకీ, నాగబాబు, హీరో, హీరోయిన్మొదలగు నటీనటులతో రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో క్లైమాక్స్ పోరాటాలతోపాటు మణిశర్మ సంగీత సారధ్యంలో ఓ ప్రత్యేక గీతంలో అమీషా పటేల్ పైన చిత్రీకరించుకొనిఉక్రెయిన్, జార్జియాలో మరో రెండు పాటలు చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది. VKAఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరులోపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, జనవరిలో అత్యధిక థియేటర్లలోవిడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు విజయ్ కరణ్, కౌశల్ కరణ్,అనిల్ కరణ్ తెలిపారు.

సాంకేతిక నిపుణులు

సంగీతం               : మణిశర్మ
D.O.P                        : వెంకట్ గంగదారి
ఆర్ట్                    : మురళి కొండేటి
ఫైట్స్                  : నందు
ఎడిటర్                       : M. R. వర్మ
డాన్స్                  : స్వర్ణ,సతీష్, అమిత్
స్టిల్స్                  :వికాస్
కాస్ట్యూమ్ డిజైనర్   : భాను
కాస్ట్యూమ్స్           : మురళి
మేకప్                 : వేణు
కో – డైరెక్టర్          :చల్లపల్లి వెంకటేశ్వర రావు
పబ్లిసిటి డిజైనర్      : అనిల్,భాను
P.R.O                        :వంశీ శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్   : శ్రీరంగంసతీష్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ :మల్లిక్
నిర్మాతలు            :  విజయ్ కరణ్
కౌశల్ కరణ్
అనిల్ కరణ్

కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన

నటీనటులు:
హీరో                   : ఆశిష్రాజ్ (నూతన పరిచయం)
హీరోయిన్            : రుక్సార్మీర్
సుమన్
నాగ బాబు
రాంకీ
రాశి
బ్రహ్మానందం
అలీ
ప్రదీప్ రావత్
పోసాని కృష్ణ మురళి
పృద్వీ
శ్రీనివాస్ రెడ్డి
అజయ్ ఘోష్
నవీన్ నేని
జెమినీ సురేష్
R K మామ
‘జబర్దస్త్’ టీం
SPECIAL SONG : అమీషా పటేల్
తదితరులు

Facebook Comments
Share

This website uses cookies.