Social News XYZ     

Mohanlal’s ‘Manyampuli’ on November25th

Mohanlal's 'Manyampuli' on November25thAfter announcing the plans to dub the Mollywood Superstar Mohanlal’s Latest Movie Pulimurugan in Telugu as Manyam Puli, by producer Sindurapuvu Krishna reddyunder Sarswathi films banner.The makers have now revealed that the Vysakhdirectorial will hit the screens in Andhra Pradesh and Telangana on November 25th,2016. It has to be noted that Mohanlal has a good market in the region withthe release of the superstar's recent movies Manamantha and Janatha Garage.

Among them, Janatha Garage has already become one of the biggest grossers inTelugu and Mohanlal was well appreciated for his performance in the actionthriller. On the other hand Pulimurugan has been making tremendous business atthe worldwide box office. The action thriller, which is set to become the highest grosser in Malayalam, looks unstoppable increating many records.

నవంబర్ 25న మోహన్ లాల్ 'మన్యం పులి'

Mohanlal's 'Manyampuli' on November25th

 

మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'పులిమురుగన్' చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తున్నారుశ్రీ సర్వసతి ఫిల్మ్స్ అధినేత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఇప్పటికే 'మన్యం పులి' సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర బృందంతెలిపింది. ఈ నేపథ్యంలోమన్యం పులి ని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత కృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నారు.'జనతా గ్యారేజ్' సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాటు ఫుల్ క్రేజ్ రావడంతో, అదేఊపులో 'మన్యంపులి' సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్

Facebook Comments

%d bloggers like this: