Social News XYZ     

Press Note on CINIVARAM

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో “సినివారం” శీర్షికతో రవీంద్రభారతిసమావేశమందిరంలో ప్రతీ శనివారం  లఘుచిత్రం/డాక్యుమెంటరీప్రదర్శన.

Press Note on CINIVARAM

 

ఇటీవలీ కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే  యువ దర్శకులుఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూకొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లుకానీ, డాక్యుమెంటరీలు  కానీ అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.
అయితే...ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరంఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి. ఉన్నప్పటికి  అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి.

 

ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశమందిరంలో ప్రతీశనివారం “సిని వారం” పేరిట ఈ నవ తరం దర్శకులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ / డాక్యుమెంటరీలనుస్క్రీనింగ్ చేయాలని, ఈ స్క్రీనింగ్ సౌకర్యాన్ని ఉచితంగా అందించివారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ఔత్సాహిక యువ దర్శక-రచయిత-నటులు తాము తీసిన లఘు చిత్రాలు/డాక్యుమెంటరీలనుప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ “సినివారం” అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరుతున్నాం.

దీనికిగాను మీఋ చేయాల్సిందల్లా , మీ షార్ట్ ఫిల్మ్ /డాక్యుమెంటరీ వివరాలను , సంక్షిప్తకథను, సాంకేతిక నిపుణుల వివరాలతో కలిపి మీకు రవీంద్రభారతి సమావేశమందిరాన్ని కేటాయించవలసిందిగా డైరెక్టర్, సాంస్కృతిక శాఖ వారినిఅభ్యర్థిస్తూ ఒక ఉత్తరాన్ని రాయండి. లేదా cinivaram.rb@gmail.com కిమెయిల్ చేయండి లేదా +91-9849391432/040-23212832 (సతీష్)నెంబర్ లో సంప్రదించండి.

కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలికే “సినివారం” అవకాశాన్ని సద్వినియోగంచేసుకొని నవతరం సినిమా ఎదుగుదలని ప్రోత్సహిద్దాం అని సంచాలకులు మామిడి హరికృష్ణ ఒకప్రకటనలో తెలిపారు.

(మామిడి హరికృష్ణ)
సంచాలకులు
భాషా సాంస్కృతిక శాఖ,
తెలంగాణ ప్రభుత్వం

Facebook Comments

%d bloggers like this: