‘Intlo Deyyam Naakem Bhayam’ Audio Will Directly Be Released Online 

Allari Naresh-G.Nageswara Reddy's combination is known for delivering superhit entertainers like Seema Sastry, Seematapakay. To score a hat-trick they both team up again for a Hilarious Entertainer 'Intlo Deyyam..Naakem Bhayam'. B.V.S.N Prasad who produced blockbusters like "Attharintiki Daaredi','Naannaku Prematho' is producing this film under Sri Venkateswara Cine Chitra LLP banner under the presentation of Bhogavalli Baapineedu. Audio composed by Sai Kartheek will be released directly in Online today (October 31) evening. After completing all formalities, makers are planning to release the film worldwide on November 11th.

On this occasion Producer B.V.S.N Prasad, " This film is being made as a Horror Entertainer in the successful combination of Allari Naresh and Nageswara Reddy. Director Nageswara Reddy has made this film as a perfect clean entertainer which can be enjoyed by entire Family. We are releasing the Audio of the film in Online today evening.'Sathamanam Bhavathi' song which was released recently has already received tremendous response. Sai Kartheek has composed superhit audio for this film. We are releasing the film worldwide on November 11th. 'Intlo Deyyam..Naakem Bhayam' will be another superhit film in our banner."

Allari Naresh, " My favourite song in the film, 'Sathamanam Bhavathi' is already a big hit. Sai Kartheek gave very good audio for this film. After superhits Seema Sastry and Seematapakay iwth Director Nageswara Reddy, 'Intlo Deyyam..Naakem Bhayam' will be a hat-trick film in our combination. This is a fun filled Subject and is completely different from my earlier films. I enjoyed working for this film and i am sure that audience too will enjoy this film.This will be a superhit film for me."

Director G.Nageswara Reddy, " This is a Hilarious Entertainer with a right mix of Horror. This will be another superhit film for me with Allari Naresh and will be a hat-trick film for us. Along with Audio Sai Kartheek did a great job in re-recording too. I can assure that our 'Intlo Deyyam..Naakem Bhayam' will definitely entertain all sections of audience."

Along with Allari Naresh, Rajendra Prasad, Kruthika, Mouryani, Brahmanandam, Posani Krishna Murali, Prabhas Srinu, Shakalaka Shankar, Chammak Chandra, Chlapathy Rao, Kadambari Kiran, DHanraj, Pragathi, Rajitha,Amith,Tarzan, Jayavani, Apoorva, Azad will be seen in other important roles.

Music : Sai Kartheek, Cinematography : Dasaradhi Sivendra, Editing : Kotagiri Venkateswara Rao, Dialogues : Diamond Ratna Babu, Lyrics : Bhaskarabhatla, Choreography : Raju Sundaram, Ganesh, Dinesh, Fights : Sunkara Ram, Art : Narayana Reddy, Presented By : Bhogavalli Baapineedu, Producer : B.V.S.N Prasad, Story-Screenplay-Direction : G.Nageswara Reddy

ఆన్‌లైన్‌లో 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' ఆడియో విడుదల

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం ఆడియోను ఈరోజు(అక్టోబర్‌ 31) సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదలవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని నాగేశ్వరరెడ్డి రూపొందించారు. డెఫినెట్‌గా అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ చిత్రం ఆడియోను ఈరోజు సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ విడుదలైన 'శతమానం భవతి...' పాటకు అన్ని చోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సాయికార్తీక్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నా ఫేవరెట్‌ సాంగ్‌ 'శతమానం భవతి' విడుదలై చాలా పెద్ద హిట్‌ అయింది. సాయికార్తీక్‌ ఈ చిత్రం కోసం అన్నీ సూపర్‌హిట్స్‌ సాంగ్స్‌ చేశారు. నాగేశ్వరరెడ్డిగారితో చేసిన సూపర్‌హిట్‌ చిత్రాలు సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ తర్వాత 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సబ్జెక్ట్‌ ఇది. చాలా ఫన్నీగా వుంటుంది. నేను చాలా ఎంజాయ్‌ చేస్తూ నటించాను. ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాని చూస్తారు. ఈ సినిమా నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''హార్రర్‌ మిక్స్‌ అయిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అల్లరి నరేష్‌ కాంబినేషన్‌లో నేను చేస్తున్న మరో సూపర్‌హిట్‌ సినిమా ఇది. ఈ సినిమా మా ఇద్దరికీ హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. సాయికార్తీక్‌ పాటల్ని ఎంత అద్భుతంగా చేశారో రీరికార్డింగ్‌ కూడా అంతే అద్భుతంగా చేశారు. హండ్రెడ్‌ పర్సెంట్‌ అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా వుంటుంది'' అన్నారు.

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%