Social News XYZ     

Varshi Motion Pictures Akira to release in November

వర్షి మోషన్ పిక్చర్స్
అకిరా (తెలుగు కలర్)

Varshi Motion Pictures Akira to release in November

దెయ్యాన్ని చూస్తే మనిషి భయపడతాడు... అదే మనిషిని చూసి దెయ్యం భయపడితే... ఇటువంటి సరికొత్త కధాంశంతో, మన ముందుకు వినోదాన్ని పంచడానికి వస్తుంది "అకీరా". వర్షి మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో విరాట్ ను హీరోగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటుంది. ఈ చిత్రాన్ని దీపావళి శుభాకాంక్షలతో నవంబర్ మొదటి వారం లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత. నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ "దీపావళి సందర్భంగా మా చిత్రం సెకండ్ టీజర్ని రిలీజ్ చేస్తున్నాము. నవంబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మా చిత్రం బిజినెస్ ఓవర్సీస్ తో పాటు మొత్తం పూర్తి అయిపోయింది. మా చిత్రం చిన్న చిత్రం అయినా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ కాబోతుండటం చాల ఆనందంగా వుంది. మా ఈ చిత్రం మిమ్మల్నందరిని అలరిస్తుంది.. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు'' అని అన్నారు.

దీనికి తారాగణం : అనూష, అంకిత, మనోహర్, రాపిడ్ అప్పారావు, ఆర్.పి., రాకింగ్ రాకేష్, శేషు, సాయి తదితరులు.

 

సాంకేతికవర్గం : కెమెరా : జి.యల్. బాబు, సంగీతం : జయంత్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ మమ్ముట్టి.

Facebook Comments

%d bloggers like this: