రంగం
వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ కవలై వేండాం
. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంత వరకు ఈ ప్రేమ
అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.
ఎంత వరకు ఈ ప్రేమ
ట్రైలర్‌ను మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను రాహుల్ రవీంద్రన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా....
ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీ....
జీవా మాట్లాడుతూ - ఎంత వరకు ఈ ప్రేమ చాలా ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీ. మా హృదయాలకు దగ్గరైన మూవీ. ఈ సినిమా దర్శకుడు డీకే నాకు మంచి మిత్రుడు. రంగం సినిమాకు కోడైరెక్టర్‌గా వర్క్ చేసిన డీకే చెప్పిన ఈ పాయింట్ నచ్చడంతో సినిమా చేశాను. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. ఫుల్ పన్ మూవీ. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న డి.వెంకటేష్‌గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌నివ్వాలి. ఈ సినిమా రూపకల్పనలో లియోన్ జేమ్స్ మంచి సంగీతం అందించారు. సినిమా మేకింగ్‌లో సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్, టెక్నిషియన్స్‌కు థాంక్స్
అన్నారు.
అందరికీ నచ్చే చిత్రమవుతుంది.....
నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - లియోన్ జేమ్స్‌గారు మంచి మ్యూజిక్ అందించారు. అలాగే తెలుగు ఆడియెన్స్‌కు తగిన విధంగా మంత్ర ఆనంద్‌గారు సంగీత సహకారం అందించారు. సినిమా కామెడి ఎంటర్‌టైనర్. భలేభలే మగాడివోయ్, పెళ్లిచూపులు తరహా మూవీ. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడు సినిమా ఎలా ఉందని వెన్నెలకంటిగారిని అడిగాను. సినిమా తప్పకుండా సూపర్‌హిట్ సినిమా అవుతుందని..ఏం ఆలోచించనవసరం లేదనే ధైర్యానిచ్చారాయన. ఈ సినిమాకు వెన్నెలకంటిగారు అద్భుతమైన మాటలు, పాటలు అందించారు. జీవా, కాజల్ నటనతో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫార్మన్స్, టెక్నిషియన్ సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్, లవ్ స్టోరీ సహా అన్నీ ఎలిమెంట్స్ తో అందరికీ నచ్చే మూవీ అవుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్
అన్నారు.
నా హృదయానికి దగ్గరైన సినిమా ....
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - ```ఎంత వరకు ప్రేమ` సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత డి.వెంకటేష్‌గారికి అభినందనలు. డీకేగారు కూల్ డైరెక్టర్. అలా తనకు కావాల్సిన వర్క్‌ను రాబట్టుకునే డైరెక్టర్‌ను నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది. చాలా స్పెషల్ మూవీ. లియోన్ జేమ్స్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. జీవాతో వర్క్ చేయడం సంతోషం. మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, మంచి కోస్టార్. స్పాంటేనియస్ యాక్టర్. నా హార్ట్‌కు దగ్గరైన మూవీ ఇది`` అన్నారు.
డెఫనెట్ గా పెద్ద సక్సెస్ అవుతుంది....
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ```ఎంత వరకు ఈ ప్రేమ` సినిమా అనువాద సినిమా అయినప్పటికీ వెంకటేష్ దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుని స్ట్రయిట్ సినిమా విడుదల చేస్తున్నారు. జీవాగారి తండ్రిగారు సౌతిండియాలోనే ఎన్నో మంచి సినిమాలను అందించారు. అటువంటి గొప్ప నిర్మాత తనయుడైన జీవా, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన కాజల్ జంటగా నటించిన ఈ చిత్రం డెఫనెట్‌గా పెద్ద సక్సెస్ సాధిస్తుంది`` అన్నారు.
100 డేస్ ఆడాలని కోరుకుంటున్నా....
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - కాజల్, జీవా జోడీ స్క్రీన్‌పై చాలా బావుంది. నిర్మాత వెంకటేష్‌గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా 100 రోజులు ఆడాలని కోరుకుంటూ యూనిట్‌ను అభినందిస్తున్నాను
అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ మాట్లాడుతూ - మంచి మ్యూజిక్ కుదిరింది. ఆడియో, సినిమా అందరికీ నచ్చుతుంది.సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్
అన్నారు.
మంత్ర ఆనంద్ మాట్లాడుతూ - డి.వెంకటేష్‌గారు మూడేళ్లుగా తెలుసు. మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు తెలుగులో నేను సంగీత సహకారం అందించడం ఆనందంగా ఉంది. వెంకటేష్‌గారు ఇంకా పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను
అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కె.వి.వి.సత్యనారాయణ, మామిడిపల్లి గిరిధర్, మనోజ్ నందం, సి.జె.శోభారాణి,సునైన, కన్నడ హీరో పవన్ శౌర్య, హీరోయిన్ చిత్ర శ్రీ అంజ్, డైరెక్టర్ శివరాజ్, ఎస్‌మార్ట్ అధినేత్రి నీలిమ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.
జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశి, బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.
This website uses cookies.