ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆమె అతడైతే' చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - నిర్మాతలు ఎం.మారుతిప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ
కొత్తదనం ఉన్న చిత్రాలను, విభిన్నమైన కధా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు. ఇప్పటివరకు రాని ఓ డిఫరెంట్ కధాంశంతో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా హార్ట్ టచ్చింగ్ పాయింట్‌తో కె.సూర్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం 'ఆమె.. అతడైతే'. ఈ చిత్రం పోస్టర్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆడియో రిలీజ్ అయి ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ పరంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తోంది. దర్శకరత్న డా|| దాసరి ఆడియో ఫంక్షన్‌కి విచ్చేసి ఆడియోను రిలీజ్ చేయటం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనీష్ హీరోగా, చిరాశ్రీ హీరోయిన్‌గా, నూతన నిర్మాతలు మలినేని మారుతి ప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ సంయుక్తంగా 'ఆమె.. అతడైతే' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మలినేని మారుతిప్రసాద్, నెట్టెం రాధాకృష్ణలతో 'సూపర్‌హిట్' జరిపిన ఇంటర్వ్యూ.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
- మాది నెల్లూరు. మేం ఇద్దరం బ్యాంకుల్లో మేనేజర్స్‌గా జాబ్ చేసేవాళ్లం. జేబు శాటిస్‌ఫాక్షన్ ఉంది కానీ జాబ్ శాటిస్‌ఫాక్షన్ లేదు. అందుకని ఆ జాబ్‌కి రిజైన్‌చేసి మేం ఇద్దరం ఓన్‌గా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాం. 2011లో విజయవాడ వెళ్లి సెటిల్ అయ్యాం. ఇప్పుడు అక్కడే కన్‌స్ట్రక్షన్ కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాం.
ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్‌అయింది?
- దర్శకుడు సూర్యనారాయణ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ఎంతో అనుభవం వున్న వ్యక్తి. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ వద్ద కొన్ని సినిమాలకు వర్క్‌చేశాడు. ఆ తర్వాత స్రవంతి మూవీస్‌లో రామ్ సినిమాలకు పనిచేశాడు. అంతేకాకుండా తను మాకు బాగా ఫ్రెండ్. సో.. ఫ్రెండ్లీగా ఒకసారి కలిసినపుడు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పాడు. మాకు బాగా నచ్చింది. కధ డెవలప్ చేయి, అంతా రెడీ అయ్యాక సినిమా స్టార్ట్ చేద్దాం అని చెప్పా. అలా ఈ సినిమా స్టార్ట్ అయింది.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి?
- తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు, తనను కలెక్టర్‌గా చూడాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అనేది ఈ చిత్ర కథాంశం.
ఈ కధలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి?
- ఈ సినిమాలో కథే హీరో. తెలుగులో ఇప్పటి వరకు రాని ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాం. ఆలీ కామెడీ, హీరో, హీరోయిన్‌కు మధ్య వచ్చే లవ్‌సీన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి.
ముఖ్య పాత్రలు ఎవరు చేశారు?
- భానుచందర్ లెక్చరర్ క్యారెక్టర్‌లో నటించారు. తనికెళ్ల భరణి హీరో ఫాదర్‌గా అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. సెంటిమెంట్, ఎమోషన్ సీన్స్‌ని బాగా రక్తికట్టించారు. అలాగే ఆలీ ఓ జోవియల్ క్యారెక్టర్‌లో నటించారు. చాలా ఫన్నీగా ఈ క్యారెక్టర్ ఆడియన్స్‌ని కడుపుబ్బ నవ్విస్తుంది. చాలా రోజుల తర్వాత సుధ హీరో మదర్‌గా మా చిత్రంలో యాక్ట్ చేశారు. తల్లీకొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. మనసుకి హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది.
హీరో హనీష్, హీరోయిన్ చిరాశ్రీ క్యారెక్టర్ల గురించి?
- హనీష్ ఓ మిడిల్‌క్లాస్ అబ్బాయిగా నటిస్తే చిరాశ్రీ బబ్లీగర్ల్ క్యారెక్టర్‌లో వండర్‌ఫుల్‌గా నటించింది. తన తండ్రి ఆశయాన్ని తీర్చే కొడుకు పాత్రలో హనీష్ పర్ఫామెన్స్ ఇరగదీశాడు. ఈ సినిమాతో వారిద్దరికీ చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా హనీష్ అమ్మాయి వేషం క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు.
టెక్నీషియన్స్ ఎఫర్ట్స్ గురించి చెప్పండి?
- ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. సూపర్‌హిట్ చిత్రాలకు ఎడిటర్‌గా వర్క్‌చేసిన మార్తాండ్ కె. వెంకటేష్ మా సినిమాకి ఎక్స్‌లెంట్ ఎడిటింగ్ చేశారు. జాతీయ అవార్డు విన్నర్ సుద్దాల అశోక్‌తేజ గారు హృదయాన్ని కదిలించే పాటల్ని రాశారు. అలాగే యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ యశోకృష్ణ మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చారు.
ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
- చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎందుకంటే మా ఆడియోకి దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు గారిలాంటి లెజెండ్ మా చిత్రం ఆడియోను రిలీజ్ చేయడం ప్రతి ఒక్కరికీ రీచ్‌అయింది. పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'నాన్న' పాట చాలా పెద్ద హిట్ అయింది. యుట్యూబ్‌లో 'ప్రేమమ్' తర్వాత మా సినిమా పాటలకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఆడియోలాగే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌తో ఉన్నాం. మా ఆడియో ఫంక్షన్‌కి విచ్చేసి ఆడియో రిలీజ్ చేసిన
దర్శకరత్న డా|| దాసరిగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
బిజినెస్‌పరంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
- ఆడియో, ట్రైలర్స్ చాలా బాగుండడంతో మా సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. బిజినెస్‌పరంగా కూడా అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
రిలీజ్ ఎప్పుడు?
- సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఎక్కడా వల్గారిటీ లేకుండా సినిమా చాలా క్లీన్‌గా ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీశారని సభ్యులందరూ అప్రీషియేట్ చేయడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. మంచి డేట్ చూసుకుని నవంబర్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం.
డైరెక్టర్ సూర్యనారాయణ ఈ ప్రాజెక్ట్‌ని ఎలా డీల్ చేశాడు?
- ఈ సినిమాకి అన్నీ తానై ఇరవై మంది చేసే పని తను ఒక్కడే కష్టపడి ఎంతో హార్డ్‌వర్క్ చేశాడు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా వుండి తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని రాబట్టుకున్నారు. మాకు కధ ఏదైతే చెప్పాడో దానికి టు హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్‌పై ప్రజంట్ చేశాడు. సినిమా చూశాక నిర్మాతలుగా పూర్తి సంతృప్తి కలిగించింది. డెఫినెట్‌గా సినిమా సక్సెస్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
నెక్ట్స్ సినిమా ఏంటి?
- ఈ సినిమా రిలీజయ్యాక సూర్యనారాయణ దర్శకత్వంలోనే ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.