యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా శ్రీమతి జగన్‌మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో సి.హెచ్.సతీష్‌కుమార్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధర్మయోగి'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 28న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు 'ధర్మయోగి' కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఎంటర్‌టైనర్ అని ప్రశంసించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 28న విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ ఈ చిత్రంలోని పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆడియన్స్‌లో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వారి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 28న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా బేనర్‌కి మంచి పేరు తెస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. '' అన్నారు.
ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ ఎస్., ఎడిటింగ్: ప్రకాష్ మబ్బు, సంగీతం: సంతోష్ నారాయణన్, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.
This website uses cookies.