'ధర్మయోగి'(ది లీడర్) పాటల విడుదల
'రఘువరన్ బి.టెక్' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో పలువురు సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగింది. హీరో ధనుష్ 'ధర్మయోగి' సీడీని ఆవిష్కరించారు. 'కబాలి' సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది.
ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ - ''ఈ సినిమాకి వర్క్ చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు, 'ధర్మయోగి'గా తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత సతీష్‌కుమార్‌గారికి నా ధన్యవాదాలు. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డూయెల్ రోల్ చేశాను. ఇది అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. పాటలు బాగా వచ్చాయి. ఇప్పటికే తమిళ్‌లో చాలా పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. మళ్ళీ దీపావళికి అందర్నీ కలుస్తాను'' అన్నారు.
నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - ''ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్ చేసిన రెండు క్యారెక్టర్స్ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. త్రిష ఈ సినిమా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో చేస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. నిర్మాత మల్కాపురం శివకుమార్‌గారు నాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం పెద్ద హిట్ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ - ''ధనుష్ ఏ లాంగ్వేజ్‌లో సినిమా చేసినా స్ట్రయిట్ సినిమాలాగానే ఉంటుంది. కలెక్షన్స్ పరంగా, కంటెంట్ పరంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. రియాలిటీతో కామన్ మేన్‌కు దగ్గరగా ఉండే సినిమాలు చేస్తారు ధనుష్. దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో సూపర్‌హిట్ అయి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ - ''ధనుష్ చాలా ఎనర్జిటిక్ స్టార్. వై దిస్ కొలవెరి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ధనుష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. గ్రేట్ నటుడు. నిర్మాత సతీష్‌గారికి ధర్మయోగి సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''ధర్మయోగి అనే టైటిల్ చాలా బ్రిలియెంట్‌గా ఉంది. ధనుష్ గారి గడ్డం గెటప్ నాకు బాగా నచ్చింది. ధనుష్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఆయన తెలుగులో కూడా స్ట్రయిట్ మూవీ చేయాలని కోరుకుంటున్నాను. ధర్మయోగి మంచి సక్సెస్ అవుతుంది. నిర్మాత సతీష్‌కుమార్‌గారికి, దర్శకుడు సహా మిగతా టీంకు అభినందనలు'' అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ''నిర్మాత సతీష్‌కుమార్‌గారితో మంచి పరిచయం ఉంది. సినిమా బావుండటం, సతీష్‌కుమార్‌గారితో మంచి అనుబంధం ఉండటంతో సినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాను. ధనుస్ తొలిసారి డబుల్ రోల్ చేస్తున్నారు. ధర్మయోగి సినిమా ధనుష్‌గారికి, సతీష్‌గారికి మంచి పేరును, డబ్బును తెచ్చి పెట్టే సినిమా అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.
గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ''ఇంతకుముందు ధనుష్‌గారి సినిమాలకు పాటలు రాశాను. ఈ సినిమాలో సింగిల్ కార్డ్‌గా అన్ని పాటలు నేనే రాశాను. పాటలు బాగా కుదిరాయి. సంతోష్ నారాయణన్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో కూడా పాటలు చాలా పెద్ద హిట్ అవుతాయి. సినిమా కూడా సూపర్‌హిట్ అయి మా నిర్మాత సతీష్‌కుమార్‌గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీకృష్ణ, భరత్‌చౌదరి, సురేష్ కొండేటి, డైరెక్టర్ శశిభూషణ్, రాజ్ మాదిరాజ్, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ ఎస్., ఎడిటింగ్: ప్రకాష్ మబ్బు, సంగీతం: సంతోష్ నారాయణన్, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.