Social News XYZ     

Metro songs recording begins

పాట‌ల రికార్డింగ్ లో సంచ‌ల‌నాల `మెట్రో`

Metro songs recording begins

సంచ‌ల‌నాల మెట్రో తెలుగులో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందించిన‌ ఎస్‌.కె.పిక్చ‌ర్స్ అధినేత‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌కుడిగా, చుట్టాల‌బ్బాయి ఫేం రామ్ తాళ్లూరి స‌తీమ‌ణి ర‌జ‌ని తాళ్లూరి ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై నిర్మిస్తున్న‌ చిత్ర‌మిది. ఆనంద్ కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జోహ‌న్ సంగీతం అందించారు. సాహితి పాట‌లు, మాట‌లు అందిస్తున్నారు. ఈ సినిమా రికార్డింగ్ కార్య‌క్ర‌మాలు సంగీత‌ద‌ర్శ‌కుడు- సింగ‌ర్ ర‌ఘురామ్ సార‌థ్యంలో హైద‌రాబాద్ లిరిక్స్ అండ్ ట్యూన్స్‌ స్టూడియోస్‌లో ఈ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. మ‌ద‌ర్ సెంటిమెంట్ సాంగ్‌ని శ్రీ సౌమ్య‌, శ్రీ‌కృష్ణ‌, ర‌ఘురామ్ సంయుక్తంగా ఆల‌పించారు. ఈ భూమి ఎవ‌రికీ సొంతం కాదురా.. అంటూ సాగే పాట‌ను ధ‌నుంజ‌య్‌, శ్రీ‌కృష్ణ పాడారు. నేనా .. అంటూ సాగే సుమ‌ధుర‌మైన పాట‌ను గీతామాధురి ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత, ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి మాట్లాడుతూ -ఇదో ఇంట్రెస్టింగ్ క‌థాంశంతో తెర‌కెక్కించిన సినిమా. యాక్ష‌న్‌ డ్రామా, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే క‌థాంశంతో తెర‌కెక్కింది. నిత్యం మ‌నం వార్త‌ల్లో వినే చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు ఓ విజువ‌ల్ ట్రీట్‌గా తెర‌కెక్కించారు. ఈ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లిరిక్స్ అండ్ ట్యూన్స్ స్టూడియోస్‌లో రికార్డింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించాం. టాప్ సింగ‌ర్స్ గీతామాధురి, శ్రీ‌సౌమ్య, శ్రీ‌కృష్ణ‌, ర‌ఘురామ్‌, ధ‌నుంజ‌య్ ఈ చిత్రానికి పాడారు. చ‌క్క‌ని సంగీతం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే చిత్ర‌మిది అన్నారు.

 

ఎస్‌.కె.పిక్చ‌ర్స్ అధినేత, చిత్ర స‌మ‌ర్ప‌కులు సురేష్ కొండేటి మాట్లాడుతూ -నిత్యం వార్తా చానెళ్ల‌లో చైన్ స్నాచ‌ర్ల హ‌ల్‌చ‌ల్ గురించి వింటూనే ఉన్నాం. రోడ్ పై వెళుతున్న మ‌హిళ మెడ‌లోంచి చైన్ లాక్కెళ్లిన స్నాచ‌ర్‌..., బైక్‌పై రైడ్ చేస్తూ మెడ‌లో బంగారు గొలుసు లాక్కెళ్లిన‌ చైన్ స్నాచ‌ర్ .., న‌గ‌రాల్లో విరుచుకుప‌డుతున్న స్నాచ‌ర్స్‌.. లాంటి వార్త‌లు నిరంత‌రం వ‌స్తూనే ఉన్నాయి. నిజ జీవితాల్లో ఈ చైన్ స్నాచింగ్ ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించే ఆస‌క్తిక‌ర చిత్రం -మెట్రో. తన కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్... ఆ క్రమంలో తను  తెలుసుకున్న నిజాలేంటి..? అస‌లు చైన్ స్నాచర్ల‌ లక్ష్యమేంటి..? అన్న‌ది తెర‌పైనే చూడాలి. పాట‌ల రికార్డింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. సాహితి చ‌క్క‌ని లిరిక్స్ అందించారు. అన్ని కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసి న‌వంబ‌ర్ లో  సినిమా రిలీజ్ చేస్తాం అని తెలిపారు.

శిరీష్‌, బాబి సింహా, సేంద్ర‌న్‌, నిశాంత్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  జోహ‌న్‌, మాట‌లు- పాట‌లు:  సాహితి, కెమెరా: ఎన్‌.ఎస్‌. ఉద‌య కుమార్‌, నిర్మాత‌:  ర‌జ‌ని తాళ్లూరి, స‌మ‌ర్ప‌కులు:  సురేష్ కొండేటి, ద‌ర్శ‌క‌త్వం: ఆనంద కృష్ణ‌న్‌.

Facebook Comments