నటుడు బ్రహ్మాజి ముఖ్యపాత్రలో, మహేంద్ర ఇ యమ్ యస్, కాత్యాయనిశర్మ, షాలు, నటీనటులగా, ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ సంస్ధ నిర్మిస్తున్న "ట్రాప్" తెలుగు చిత్రం టైటిల్ ను, దానికి సంభంధమైన మోషన్ పోస్టర్ ను, దర్శకరత్న డా: దాసరి నారాయణరావుగారి చేతులమీదుగ లాంచ్ చేయటం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ట్రాప్ చిత్రాన్ని డిశంబరు లో విడుదల చేసే ఆలోచన చేస్తున్నామని నిర్మాత ఆళ్ళ. స్వర్ణలత గారు తెలియచేశారు. నిర్మాత మాట్లాడుతు సినిమాకు పెద్ద దిక్కైన గురువుగారు దర్శకరత్న డా: దాసరి నారాయణరావు గారు మా సినిమా లోగోను లాంచ్ చేయటం మా అద్రుష్టం గా భావిస్తూ ఆయనకు మనస్ఫూర్తిగా నా క్రుతజ్ఙతలు తెలపుకుంటున్నాను.
కొత్త నిర్మాతగా సినిపరిశ్రమలోకి అడుగు పెట్టాలంటే ఎలాంటి కధ తో సినిమా తీయాలో అలాంటి కధతోనే మేం వస్తున్నాం అని, త్వరలో మిగిలిన వివరాలు తెలియచేస్తాం అని నిర్మాత ఆళ్ళ స్వర్ణలత తెలియ చేశారు. దర్శకుడు వీ యస్ ఫణీంద్ర మాట్లాడుతూ, ఎవరైనా దర్శకుడిగా ఎదగాలంటే ఎటువంటి వారి దీవెనలు కావాలో అటువంటి దీవెనలు నాకు దోరికినందుకు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు గారికి నా హ్రుదయపూర్వక నమస్కారములు. ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించేలానే నేను సినిమా తీశాను, బ్రహ్మాజి గారి క్యారక్టర్ సినిమాకు హైలెట్, ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది, సినిమా పిచ్చి మగాళ్ళకే కాదు ఆడావాళ్ళకు కూడా ఇంతలా ఉంటుందా అనిపించింది నాకు మా నిర్మత స్వర్ణలత గారిని చూసినప్పుడు, మాకు చాలా సపోర్ట్ ఇచ్చి టీంగా పని చేశారు,త్వరలో టీజర్ ను లాంచ్ చేయనున్నాం అని దర్శకుడు వీ యస్ ఫణింద్ర తెలిపారు.
సినిమాకు మ్యూజిక్ : ఈశ్వర్ పెరావలి, కెమేరా : ప్రవీణ్. కే, ఎడిటర్: రామారావ్ జెపి, నిర్మత: ఆళ్ళ స్వర్ణలత, రచన, దర్శకత్వం: వీ యస్ ఫణీంద్ర.
This website uses cookies.