తెలుగులో సంచలన విజయాలు సాధించిన అనువాద చిత్రాల్లో ‘రంగం’ ఒకటి. సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జీవాకు తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు తెస్తూ.. జీవా నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘యాన్’ అనే చిత్రం ‘రంగం`2’ పేరుతో ముస్తాబవుతోంది.
‘రంగం’ చిత్రానికి సంగీత సారధ్యం వహించిన హ్యారిస్ జైరాజ్ ‘రంగం2’ చిత్రానికి కూడా మ్యూజిక్ చేశారు. ‘రంగం’లో జీవా సరసన మొన్నటి మేటి కథానాయకి రాధ కుమార్తె కార్తీక నాయర్ హీరోయిన్‌గా నటించగా.. ‘రంగం
2’లో జీవాకు జంటగా రాధ రెండో కుమార్తె` కార్తీక చెల్లెలు తులసీ నాయర్ నటించడం విశేషం.
జస్‌రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎన్.బాలాజి (సూపర్‌గుడ్ బాలాజి) నిర్మిస్తున్న ‘రంగం`2’ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా.. సూపర్‌గుడ్ బాలాజీగా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన నిర్మాత ఎ.ఎన్.బాలాజి మాట్లాడుతూ.. ‘సూపర్‌గుడ్ చౌదరిగారి ఆశీస్సులతో జస్‌రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రంగం2’తో మా హీరో జీవాకు తెలుగులో గల ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది. ‘రంగం’ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి.ఆనంద్ దర్శకుడిగా పరిచయం కాగా- ‘రంగం
2’తో మరో సుప్రసిద్ధ సినిమాటోగ్రఫర్ రవి.కె.చంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం. ‘రంగం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో.. ‘రంగం`2’ కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. జీవా పర్‌ఫార్మెన్స్- తులసీనాయర్ గ్లామర్, హారీస్ జైరాజ్ మ్యూజిక్, రవి.కె.చంద్రన్ స్క్రీన్‌ప్లే- దర్శకత్వం ‘రంగం-2’ చిత్రానికి ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఆడియో విడుదల చేసి, నవంబర్ ద్వితీయార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
నాజర్, జయప్రకాష్, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: మానుష్ నందన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హ్యారిస్ జైరాజ్, సమర్పణ: జస్‌రాజ్ ప్రొడక్షన్స్, నిర్మాత: ఎ.ఎన్.బాలాజి (సూపర్‌గుడ్ బాలాజి), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్!!
This website uses cookies.