Social News XYZ     

Kalyan Ram and Puri’s ISM Audio Launched

Kalyan Ram and Puri's ISM Audio Launched

నందమూరి క‌ల్యాణ్‌ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ఇజం.ఈ సినిమా ఆడియో ని హైద‌రాబాద్‌లో బుధ‌వారం రాత్రి విడుదల చేసారు. నందమూరి హరి కృష్ణ, నందమూరి రామ‌కృష్ణ‌, ఎన్టీఆర్, దిల్ రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిధులు గా విచ్చేసారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుద‌లైంది.

ఈ కార్యక్రమం లో,

 

ప్ర‌కాష్‌ రాజ్ మాట్లాడుతూ "అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. క‌ల్యాణ్‌ రామ్ ని చూస్తుంటే అత‌నిలో ఉన్న ఆక‌లి తెలుస్తోంది. ఓక నటుడి కి ఆ ఆక‌లి అర్ధం అవుతుంది. పూరి విజ‌న్ తెలుసు. మాస్‌కి క్లాస్ ట‌చ్ ఇవ్వ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. సినిమా సూప‌ర్‌ హిట్ అవుతుంది. అంతా పాజిటివ్‌గా ఉంది" అని అన్నారు.

బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ "విజువ‌ల్స్ మామూలుగా లేవు. చాలా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పగలను" అని చెప్పారు.

హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ "సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. టీజ‌ర్ , పాట‌లు బావున్నాయి" అని అన్నారు .

భాస్క‌ర‌భ‌ట్ల మాట్లాడుతూ "పూరి జ‌గ‌న్నాథ్‌ గారి తో పని చేస్తోన్న 24వ‌ సినిమా ఇది. అయన ఇచ్చిన సపోర్ట్ కి ఎప్పటికి రుణ పది ఉంటాను. ఆయనకి రాయ‌డంలో కంఫ‌ర్ట్ ఉంటుంది. . అనూప్‌తో ప‌నిచేస్తున్న మూడో సినిమా ఇది. క‌ల్యాణ్‌ రామ్ గారి కి తొలిసారి పాటలు రాయ‌డం ఆనందంగా ఉంది" అని అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ "ఇజం" పాట‌ల‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మా సంస్థ‌కు ఈ ఏడాది బావుంది. టీజ‌ర్ చూస్తే ఇడియ‌ట్ సినిమా గుర్తుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక గంటా రెండు నిమిషాలుంటే, సెకండ్ హాఫ్ గంటా ఐదు నిమిషాల నిడివి ఉంది. మంచి రేంజ్ ఉన్న సినిమా అవుతుంది " అని తెలిపారు.

అలీ మాట్లాడుతూ "క‌ల్యాణ్‌రామ్ మంచి మ‌న‌సున్న హీరో. ఎక్క‌డా గ‌ర్వం అనేది ఉండ‌దు. కళ్యాణ్ పూరీ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను " అని అన్నారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ "మా నర్సీపట్నం కుర్రోడు ఇవాళ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అంటే గర్వం గా ఉంది. ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం నుంచి నాకు పూరి జ‌గ‌న్నాథ్‌తో ప‌రిచ‌యం ఉంది. ఇజం చిత్రం క్లైమాక్స్ చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి. ఏడు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ ను క‌ల్యాణ్ రామ్ ఇర‌గ‌దీశాడు." అని అన్నారు .

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "క‌ల్యాణ్‌రామ్‌గారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి, కళ్యాణ్ గారికి థాంక్స్" అని అన్నారు.

అదితి ఆర్య మాట్లాడుతూ "క‌ల్యాణ్‌ రామ్ గారు పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చారు. పెద్ద హీరో. ఆయన చాలా ఆరోగెంట్‌గా ఉంటారేమో అని భయపడ్డా. కానీ ఆయన చాలా సాఫ్ట్ , డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. ఈ చిత్రం లో అవకాశం ఇచ్చినందుకు ఆయనకి, పూరి గారి కి థాంక్స్ . ఈ చిత్రం లో నటించటం చాలా బాగుంది" అని తెలిపారు.

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ " ఎప్పటి నుండో కళ్యాణ్ రామ్ గారి తో సినిమా చేయాలి. కొంచెం లేట్ అయినా ఇన్నాళ్ళకి మంచి సినిమా చేసాం. ఇజం టీజ‌ర్ హ‌రికృష్ణ‌ గారికి న‌చ్చి, "ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు" అని అన్నారు. ఎన్టీఆర్ అయితే కేక వేసాడు. ఈ సినిమా లో ఒక కోర్ట్ సీన్ లో కళ్యాణ్ రామ్ ఇరగదీసాడు. కోర్ట్ సీన్స్ అంటే నందమూరి వారికే చెందుతాయి. ఆయన యాక్టింగ్ చూసి చాలా గ‌ర్వంగా అనిపించింది. త‌ప్ప‌కుండా చూసిన వాళ్లంద‌రూ కూడా అది ఫీల‌వుతారు.

హరికృష్ణ గారు టీజర్ నచ్చి నాకు రెండు పావురాల‌ను ఇచ్చారు.అనూప్ నాకు ఈ సినిమాలో ఓ పాట‌ను రాసే , పాడే అవ‌కాశాన్నిచ్చాడు. పాట రాయ‌డం ఎంత క‌ష్ట‌మో అర్థ‌మైంది. దానికి బ‌దులు ఓ క‌థ రాసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా సినిమా చాలా చాలా బాగా వచ్చింది", అని చెప్పారు.

నందమూరి హ‌రికృష్ణ మాట్లాడుతూ ``ఇపుడు నా వ‌య‌సు 60. ఈ జీవితంలో ఎవ‌రూ పొంద‌లేని, అనుభూతులను నేను పొందాను. మహానుభావుడు నంద‌మూరి రామారావు గారి ద‌గ్గ‌ర 30 ఏళ్లు ప‌నిచేశా. ఆయ‌న‌తో నాకున్న అనుభ‌వాలు హిమాల‌య శిఖ‌రాల‌ను మించాయి. సినిమా రంగంలో ఆయ‌న‌తో ఎన్నో విజ‌యాలు చూశాను. రాజ‌కీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి 8 నెలల్లో గెలిచాం. వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. డబ్బు పోవచ్చు. కానీ ఎవ‌రూ త‌స్క‌రించ‌లేనిది అభిమానం.

తెలుగు ప్ర‌జ‌లు నా బిడ్డ‌ల‌కు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియ‌ర్ టెంప‌ర్ హిట్ ఇచ్చాడు. క‌ల్యాణ్‌రామ్ ప‌టాస్ ఇచ్చాడు. నా 60వ ఏట జూనియ‌ర్ జ‌న‌తాగ్యారేజ్ బ్లాక్బస్టర్ ఇచ్చాడు. క‌ల్యాణ్ ఇప్పుడు ఇజంతో ముందుకు రాబోతున్నాడు. హిట్ కొడ‌తాడ‌నే న‌మ్మ‌కం ఉంది.

నేను ఎప్పుడూ ఎవరికీ తల వంచను. కష్టం అయినా నష్టం అయినా అంతే. మా నాన్న క‌డుపున పుట్ట‌డ‌మే నేను చేసుకున్న మ‌హ‌ద్భాగ్యం. ఆయ‌న ఆశీస్సులు పిల్ల‌ల‌కున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట‌ను నా ఇద్ద‌రు పిల్ల‌లూ గుర్తుంచుకున్నారు. నా పెద్ద కుమారుడు త‌న త‌మ్ముళ్లు త‌ప్ప‌కుండా హిట్లు తీస్తార‌ని నాతో చెప్పేవాడు. అత‌ను లేక‌పోయినా అత‌ను న‌మ్మిన మాట ఉంది. ఆ మాట ప్ర‌కారం పిల్ల‌లిద్ద‌రూ హిట్లు కొట్టారు. పై నుంచి మా నాన్న‌, నా పెద్ద కుమారుడు వీళ్ల‌ను ఆశీర్వ‌దిస్తున్నారు " అని అన్నారు.

క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ "ఇజం టీమ్ నా బెస్ట్ టీమ్. నేనింత వ‌ర‌కు ప‌నిచేసిన వాళ్ల‌లో ఈ యూనిట్ ద బెస్ట్. అనూప్ మంచి పాట‌లిచ్చారు. US నుండి ఫోన్ చేసి నా కెరీర్ బెస్ట్ సాంగ్స్ అని చెప్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌గారు చాలా ఉత్సాహాన్నిచ్చారు. నా కెరీర్‌లో బెస్ట్ డైర‌క్ట‌ర్ ఆయ‌న‌. ల‌వ‌బుల్ ప‌ర్స‌న్‌. ప్ర‌తి వ్య‌క్తిలోనూ ఉత్సాహాన్ని నింపి ప‌ని చేయించుకున్నారు. థాంక్స్ ఆ లాట్ పూరీ సర్", అని అన్నారు .

ఎన్టీఆర్ మాట్లాడుతూ "అనూప్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ల‌లో మెలోడీ ల‌ను అత్య‌ద్భుతంగా చేయ‌గ‌లిగింది అనూప్‌. జ‌గ‌న్ భ‌య్యా ఒక‌ రోజు పిలిచి క‌ల్యాణ్‌ రామ్ అన్న‌య్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది . జ‌గ‌న్‌ గారితో అన్న‌య్య ఓ సినిమా చేస్తే బావుంటుంద‌ని నాకు ఎప్ప‌టి నుంచో అనిపించేది. ఎందుకంటే టెంప‌ర్ చేయ‌క‌ ముందు నేను వేరు. అది చేసిన త‌ర్వాత నేను వేరు. నాలోకాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ టీజ‌ర్ చూశాక అది నిజ‌మ‌నిపించింది. అన్న‌య్య‌లోని వేరే ఆటిట్యూడ్ ని తెర‌పై చూపించారు పూరి భ‌య్యా. నేనెప్పుడూ అన్నయ్య లో ఈ ఆటిట్యూడ్ చూడలేదు.

అన్న‌య్య ప‌డ్డ‌ క‌ష్టం నాకు తెలుసు. న‌టుడిగా ఆయ‌న త‌ప‌న నాకు తెలుసు. ఎందుకంటే ఆయ‌న నాకు ఫిలాస‌ఫ‌ర్‌. గైడ్‌, కొన్ని స‌మ‌యాల్లో గ‌ర్ల్ ఫ్రెండ్ కూడా. ఆయ‌న ప‌డ్డ క‌ష్టాన్ని ప్ర‌త్య‌క్షంగా చూశాను. క‌ష్టానికి ఎప్పుడూ విజ‌యం ఉంటుంది. ఆయ‌న కెరీర్‌లో ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. క‌లం బ‌లం గురించి ఇంకోసారి గుర్తు చేసే సినిమా ఇది" అని చెప్పారు.

Facebook Comments