Social News XYZ     

Kapali trailer launched

Kapali trailer launched

రోహిణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డాక్టర్ మేసా రాజేశ్ ప్రధానపాత్రలో స్వీయ దర్శకత్వంలో lనిర్మించి తెరకెక్కించిన సరికొత్త థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా 'కాపాలి'. మిమ్మల్ని మీరే కాపాడుకోండి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. పెళ్ళి చూపులు సినిమాతో మంచి పేరు సంపాదించిన నిర్మాత రాజ్ కందుకూరి కాపాలి సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్ ను లాంచ్ చేసారు.

దర్శకుడు మేసా రాజేశ్ మాట్లాడుతూ ' సినిమా చేయాలని ఎప్పటినుండో ఇంట్రెస్ట్ ఉండేది. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల చిత్రాలను చూసి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది . అందులో స్పెషల్ గా ఉండే మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో మీడియా బేస్డ్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచననుండి వచ్చిందే కాపాలి. ఫౌండ్ పుటేజ్ ఆధారంగా ఓ జర్నలిస్ట్ ఎలా తనకు అప్పగించిన టాస్క్ ఎలా పూర్తి చేశాడన్నదే మూవీ. నాలుగు కథలు ఒకేసారి జరుగుతుంటాయి అంతేగాక మన దేశంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లకు భిన్నంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పటివరకు జర్నలిజం ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమాలకు ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. జర్నలిస్ట్ నిజ జీవితంలో ప్రాణాలకు తెగించి ఎలా కష్టపడుతున్నారో నాకు తెలుసు. అందుకే ఈ సినిమా జర్నలిస్ట్ మిత్రులకు అంకితం' అన్నారు.

 

పెళ్ళిచూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ ' నాకు హార్రర్ ఎక్స్ పీరియన్స్ లేదు కానీ రాజేశ్ గారు ఈ సినిమాతో చూపిస్తారని నమ్ముతున్నాను. నా దగ్గర కథ ఉందని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం సినిమా తీయడం చాలా గొప్ప విషయం. కంటెంట్ లో నిజంగా దమ్ముంటే 7 లక్షలతో తీసిన పారనామల్ సినిమా ఎలా అయితే 1300కోట్లు వసూలు చేసిందో అలా మంచి సినిమాలకు భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతున్నాను.' అన్నారు

Facebook Comments