Categories: Movies Telugu

Hyper Censored, releasing worldwide on September 30th

'హైపర్‌' సెన్సార్ పూర్తి.... వ‌ర‌ల్డ్‌వైడ్ గా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

హీరో రామ్ మాట్లాడుతూ - నేను, సంతోష్ శ్రీనివాస్ చేసిన కందిరీగ పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ మా కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. హైపర్ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంక గారు సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మించారు. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది అన్నారు.

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - రామ్, సంతోష్ శ్రీన్ వాస్ ల హైపర్ పాటలకు, రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్సందన వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ - ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. కథ రాసుకోగానే రామ్‌ ఎనర్జీకి పర్‌ఫెక్ట్‌ గా సరిపోయే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది అన్నారు.
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Facebook Comments
Share

This website uses cookies.