Social News XYZ     

Manchu Lakshmi’s ‘Lakshmi Bomb’ audio releasing on October 5th

అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న `లక్ష్మీ బాంబ్` ఆడియో

Manchu Lakshmi's 'Lakshmi Bomb' audio releasing on October 5th

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ 5న సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా....

మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''డిఫరెంట్ గా జడ్జ్ పాత్రలో కనపడతాను. ఇప్పటి వరకు చేయని చాలెంజింగ్ పాత్ర చాలా ఎగ్జయింటింగ్ గా ఉంది. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.

 

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. ఫైట్స్, సాంగ్స్ హైలెట్ అవుతాయి. అక్టోబర్ 5న ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించి, అక్టోబర్ లో దీపావళి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జయప్రదగారి జస్టిస్ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీగారే. మనోజ్ గారు క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారుఅక్టోబర్ 5న సినిమాను విడుదల చేసి మూవీని దీపావళి సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘‘ అన్నారు.

పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

Facebook Comments