ఓం శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో సాంగ్స్ కంపోజింగ్ జరుగుతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. 'ప్రేమభిక్ష' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెల 19 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి 75 శాతం షూటింగ్ అనంతపురం జిల్లా భద్రపట్నంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సారథ్యంలో అమూల్య స్టూడియోలో సాంగ్స్ కంపోజింగ్ జరుగుతున్నాయి. ప్రముఖ సింగర్స్ ధనుంజయ్, సునీల్ కశ్యప్, హేమచంద్రలు ఈ సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనిల్, శృతిలయలు హీరో హీరోయిన్‌లుగా నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులందరూ నటించనున్నారు...అని అన్నారు.
అనిల్, శృతిలయ, సుమన్, షఫీ, రాజేంద్ర, కింగ్ మోహన్, కిల్లర్ వెంకటేష్, జ్యోతి మొదలగు వారు నటించనున్న ఈ చిత్రానికి స్టంట్స్: శంకర్, కొరియోగ్రఫీ: ఎస్.ఎస్.కె. సందీప్, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్. ఆర్; నిర్మాతలు: ఎం.ఎన్. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఆర్.కె.గాంధీ.
This website uses cookies.