Social News XYZ     

Songs recording started for ‘Prema Bhiksha’ movie

సాంగ్స్‌ రికార్డింగ్‌లో 'ప్రేమభిక్ష'

Songs recording started for 'Prema Bhiksha' movie

ఓం శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో సాంగ్స్‌ కంపోజింగ్‌ జరుగుతుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. 'ప్రేమభిక్ష' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెల 19 నుండి షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి 75 శాతం షూటింగ్‌ అనంతపురం జిల్లా భద్రపట్నంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సారథ్యంలో అమూల్య స్టూడియోలో సాంగ్స్‌ కంపోజింగ్‌ జరుగుతున్నాయి. ప్రముఖ సింగర్స్‌ ధనుంజయ్‌, సునీల్‌ కశ్యప్‌, హేమచంద్రలు ఈ సాంగ్స్‌ రికార్డింగ్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనిల్‌, శృతిలయలు హీరో హీరోయిన్‌లుగా నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులందరూ నటించనున్నారు...అని అన్నారు.

 

అనిల్‌, శృతిలయ, సుమన్‌, షఫీ, రాజేంద్ర, కింగ్‌ మోహన్‌, కిల్లర్‌ వెంకటేష్‌, జ్యోతి మొదలగు వారు నటించనున్న ఈ చిత్రానికి స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్‌ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌; నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఆర్‌.కె.గాంధీ.

Facebook Comments