Social News XYZ     

“Call Money” movie shoot completed

విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటన
ఆధారంగా రూపొందుతున్న ‘కాల్‌మనీ’ షూటింగ్‌ పూర్తి!!

"Call Money" movie shoot completed

‘కాల్‌మనీ’ వ్యవహారం ఆమధ్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనలు ఆధారంగా.. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘కాల్‌మనీ’.

కృష్ణుడు, అంజనీకుమార్‌, సందీప్తి, నామాల మూర్తి ముఖ్య తారాగణంగా మక్కెన్‌ రంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాల్‌మనీ’ చిత్రం ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఓ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఓ డాన్‌ భరతం-`ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ ఎలా పట్టాడన్నది క్లుప్తంగా కథాంశం. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు ముగించి త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

 

ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీనివాస్‌, కెమెరా: వీణ ఆనంద్‌, సంగీతం: అర్జున్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: మక్కెన్‌ రంగా.

Facebook Comments