‘Bichagadu’ producers next titled ‘Pilla Rakshasi’

`పిల్లా రాక్ష‌సి`తో రానున్న `బిచ్చ‌గాడు` నిర్మాత‌లు

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి అందించిన చిత్రం బిచ్చ‌గాడు. విన్నూత‌మైన కంటెంట్‌తో పాటు ప‌బ్లిసిటీ కూడా తోడ‌వ‌డంతో బిచ్చ‌గాడు సినిమా సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని అందుకుంది. తెలుగులో 25 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళ‌ను సాధించి ఇటీవ‌ల విడుద‌లైన చిత్రాల్లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది.

బిచ్చ‌గాడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి రీసెంట్‌గా మ‌ల‌యాళలో ఘ‌న విజయం సాధించిన ఆన్ మ‌రియ క‌లిప్పిలాను హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ద‌క్కించుకున్న బిచ్చ‌గాడు నిర్మాత‌లు ఈ చిత్రాన్ని తెలుగులో పిల్లా రాక్ష‌సి అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు.బిచ్చ‌గాడుచిత్రానికి తెలుగులో మాట‌లు, పాటలు అందించిన ఆ సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన ర‌చ‌యిత భాషా శ్రీ మ‌ల‌యాళ చిత్రంఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగు అనువాదానికి మాట‌లు, పాట‌లు అందిస్తుండ‌టం విశేషం.

ఓ ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌న్న‌దే సినిమా. దర్శ‌కుడు మిథున్ మాన్యూల్ థామ‌స్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను రియ‌లిస్టిక్‌ పంథాలో ఆవిష్క‌రించారు. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో పాటు, మ్యాజిక్‌ ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా ఉంటుంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఓకే బంగారం ఫేం దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా, సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించింది. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Facebook Comments
Share

This website uses cookies.