హీరో కళ్యాణ్‌రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా 'అరకు రోడ్ లో' ఆడియో విడుదల
రాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం అరకు రోడ్ లో
. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను సోమవారం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. బిగ్ సీడీని పూరి జగన్నాథ్, కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను పూరి జగన్నాథ్ విడుదల చేసి తొలి సీడీని కళ్యాణ్‌రామ్ కు అందించారు. పూరి సంగీత్ ద్వారా మార్కెట్లోకి పాటలు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా..పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - అరకురోడ్‌లో థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం టీం పడ్డ కష్టమంతా తెలుస్తుంది. చాలా బావుంది. గడ్డం సాంగ్ బావుంది. అన్నీ సాంగ్స్‌లో ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్ వాసుదేవ్, నిర్మాతలు సహా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్...అన్నారు.
హీరో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ - రాం శంకర్ గత పదేళ్లుగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. హిట్ కోసం ట్రై చేస్తూ ముందడుగు వేయాలని సాయిరాం శంకర్‌కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడ్డం తెల్లబడిపోతుందనే సాంగ్‌ను రాంశంకర్ ఎప్పుడో చూపించాడు. చూడగానే నచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా బావుంది. ఈ అరకు రోడ్‌లో సినిమా రాంశంకర్ కు మంచి బ్రేక్ తెస్తుందని భావిస్తున్నాను. దర్శకుడు వాసుదేవ్ చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. నిర్మాతలు సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్.. అన్నారు.
అమలాపురం ఎమ్మెల్యే ఆనంద్‌రావు మాట్లాడుతూ - నిర్మాతలతో మంచి పరిచయం ఉంది. వారి నిర్మాణంలో రానున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్... అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ- ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. హీరో రాంశంకర్ గారు, హీరోయిన్ నికిషా పటేల్ సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. రాంశంకర్‌గారి కుమార్తె ఈ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించింది. దర్శకుడు కథ చెప్పగానే బాగా నచ్చింది. ఒక సంవత్సరంగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నాము. రాంశంకర్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్... అన్నారు.
చిత్ర దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ - దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చుతుందని భావిస్తున్నాను. సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు... అన్నారు.
సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి మాట్లాడుతూ - ఇదొక థ్రిల్లర్ మూవీ. నిర్మాతలు, డైరెక్టర్ అందరూ కొత్తవాళ్ళే. అందరూ ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. రాంశంకర్, నికిషా, కమల్ కామరాజు సహా అందరికీ థాంక్స్.. అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ - మా బాబాయ్ నటించిన సినిమాల్లో ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
నిఖిషా పటేల్ మాట్లాడుతూ - 'అరకు రోడ్ లో' నా హృదయానికి దగ్గరైన చిత్రం. వాసుదేవ్‌గారు ఎంతో హార్డ్‌వర్క్ తో ఈ సినిమా చేశారు. రాంశంకర్ చాలా టాలెంటెడ్ నటుడు. జగదీష్ చీకటిగారు ప్రతి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. సినిమా బాగా వచ్చింది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్.... అన్నారు.
హీరో రాంశంకర్ మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో భయస్తుడు. అమ్మాయిలను చూస్తే నత్తి వచ్చేస్తుంది. అలాంటి హీరో జీవితంలో జరిగే ఘటనతో జీవితం టర్న్ తీసుకుంటుంది. అదేంటనేది సినిమాలో చూడాల్సిందే. నా క్యారెక్టర్‌ను డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. మంచి సక్సెస్‌ను తెచ్చి పెట్టే సినిమా అవుతుందని భావిస్తున్నాను. సక్సెస్ గురించి దండయాత్ర చేస్తున్నానని ఎవరో రాశారు. ఆ వార్త బాగా నచ్చింది. ఎందుకంటే దండయాత్ర చేయకుంటే తప్పు అవుతుంది. ఈ అరకురోడ్‌లో చిత్రంతో మరోసారి దండయాత్ర చేయబోతున్నాను. ఈ దండయాత్ర సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. వాసుదేవ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. పని రాక్షసుడు. చాలా బాగా కష్టపడ్డాడు. ఆ కష్టంతో మా అందరికీ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. ఓ మంచి డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం కలిగింది. మంచి నిర్మాతలు. జగదీష్ చీకటి మంచి సినిమాటోగ్రాపర్‌గా పేరు తెచ్చుకుంటాడు. మంచి టీంతో పనిచేశాం. ఆదరిస్తారని భావిస్తున్నాం.. అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యన్ రాజేష్, పూరి జగన్నాథ్ శ్రీమతి లావణ్య, రాంశంకర్ శ్రీమతి వనజ ,కమల్ కామరాజు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దీక్షాపంత్, అక్షత, సుప్రియ, సుఫీ సయ్యద్ మొదలగు వారు పాల్గొని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
రాం శంకర్, నికిషా పటేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్.