'వెన్నెల' ఫేం జయతి నటించిన 'లచ్చి' చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం
ప్రవైట్ ఛానల్ లో వెన్నెల అనే పోగ్రాం నుండి ప్రతి ఇంటి ప్రేక్షకులకి దగ్గరయ్యిన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి. J9 4షోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వర్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. హర్రర్ కామెడి లో ఒ కొత్త జోనర్ ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆడయో ని అతిత్వరలో సినిప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తారు. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తచేసి అక్టోబర్ లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు. లచ్చి చిత్రానికి సంబందించి మెదటి లుక్ టీజర్ ని ఈరోజు తెలంగాణా అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలా చారి గారి చేతుల మీదుగా విడుదల చేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నధ్ చేతుల మీదుగా ఈ చిత్రం మెదటి లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ గారు మాట్లాడుతూ.. ఇప్పడే లచ్చి ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశాను. అలాగే టీజర్ ని చూశాను. చాలా బాగుంది. జయతి నటిస్తూ నిర్మిస్తున్న లచ్చి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్నారు
ఎస్.వేణుగోపాలా చారి మాట్లాడుతూ... తెలంగాణా ఊర్లలో లచ్చి అని పిలవటం అలవాటు.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పిలుస్తారు. అలాంటి నానుడి వున్న టైటిల్ ని పెట్టినందుకు జయతి ని అభినందించాలి. ఆ టీజర్ ని నా చేతులమీదుగా విడుదల చేసే ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన వారందరి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్రం అందరిని పెళ్ళిచూపులు చిత్రం మాదిరిగా అలరిస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు
ఈసందర్బంగా నిర్మాత, కథానాయిక జయతి మాట్లాడుతూ "చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రోడ్యూస్ చేసిన అనుభవంతో మెట్టమెదటిసారిగా సినిమా నిర్మాణం చెపట్టాను. అలాగే ఈ చిత్రం కథ నచ్చి నేను మెయిన్ లీడ్ పాత్రలో నటించాను. హర్రర్ కామెడి జోనర్ లో కొత్త జోనర్ లో ఈ చిత్రాన్ని చేశాము. మా చిత్రానికి లచ్చి అనే టైటిల్ ని ఖరారు చేశాము. ఈ చిత్రం అంతా లచ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. ప్రముఖ కమెడియన్స్ అందరూ ఈచిత్రంలో నటించారు. అందరూ నవ్వించారుకూడా.. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.రఘు తో పనిచేయటం చాలా ఆనందంగా వుంది. ఆయన ఈచిత్రాన్ని మరో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాటలు మరుదూరి రాజా అందించారు. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మా చిత్రం యోక్క మెదటి లుక్ టీజర్ ని లాంచ్ కి వచ్చేసిన వేణుగోపాలా చారి గారికి మా ధన్యవాదాలు, అలానే ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ గారికి ప్రత్యేఖమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అతి త్వరలో సురేష్ యువన్ అందించిన ఆడియో ని విడుదల చేస్తాము. అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము." అని అన్నారు.
మరో కథానాయిక తేజశ్విని మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకు డెబ్యు, దర్శకడు ఈశ్వర్ గారు చాలా ఇష్టపడి ప్రతి పాత్రని మలిచారు. మెయిన్ పాత్రలో చేస్తున్నాను. అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
జయతి, తేజశ్విని, దిలిప్, చంద్రమెహన్, పూర్ణిమ, రఘుబాబు, ధనరాజ్, షెకింగ్ శేషు, రామ్‌ప్రసాద్ మెదలగు వారు నటించగా..
దర్శకుడు- ఈశ్వర్
నిర్మాత- జయతి
కెమెరా- యం.వి.రఘు
మాటలు- మరుదూరి రాజా
సంగీతం- సురేష్ యువన్
ఎడిటర్- ప్రభు
సాహిత్యం- కందికొండ
ఆర్ట్ - వర్మ