సూపర్‌గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక`. ఈ సినిమా టీజర్, సాంగ్‌ను రీసెంట్‌గా హైదరాబాద్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను సెప్టెంబర్ 10న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో గ్రాండ్ లెవల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో నారా రోహిత్ విశిష్ట అతిథిగా అతిథిగా హాజరయ్యారు. పెళ్ళిచూపులతో సెన్సేషనల్ హిట్ కొట్టి, ఇప్పుడు ద్వారక చిత్రంలో హీరోగా నటిస్తున్న హీరో విజయ్ దేవర కొండ, హీరోయిన్ పూజా జవేరితో పాటు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాడుతాతీయగా గాయకులతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ లైవ్ పెర్‌ఫార్మన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి అక్కడి తెలుగు వారి నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తానా అధ్యక్ష్యుడు జంపాల చౌదరి, ఉమెన్ సర్వీస్ కో ఆర్డినేటర్ రజనీ, ట్రై తెలుగు అసోసియేషన్ యుగంధర్ ఏడ్లపాటి, జగదీష్ కానూరుతో పాటు తెలుగు కల్చరల్ అసోసియేషన్ కన్వీనర్ పద్మశ్రీ ముత్యాల తదితరులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అమెరికాలో విడుదలైన సాంగ్స్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలో హైదరాబాద్‌లో ద్వారక ఆడియో విడుదల కార్య్రకమాన్ని గ్రాండ్ లెవల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
This website uses cookies.