Social News XYZ     

Siddhardha completes censor, releasing on September 16th

సెప్టెంబ‌ర్ 16న 'సిద్ధార్ధ`విడుద‌ల

Siddhardha completes censor, releasing on September 16th

సాగ‌ర్ హీరోగా న‌టించిన సిద్ధార్థ‌ ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న సాగ‌ర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం సిద్ధార్థ‌. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి
దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు. సెన్సార్ పూర్త‌యింది.

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూమా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు `ఎ` స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌లేషియా, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించాం. నాలుగు పాట‌లున్నాయి. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన బాణీల‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ అవుతుంది. సాగ‌ర్ బుల్లితెర‌మీద ఎంత‌టి పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. `సిద్ధార్థ‌`లో ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను ప్లే చేశారు. ఈ సినిమాతో వెండితెర అభిమానులు కూడా ఆయ‌నికి అభిమానులుగా మారుతారు. ఎస్‌.గోపాల్‌రెడ్డిగారిలాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో ప‌నిచేయ‌డం మా అదృష్టం. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. .

 

ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత - దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.

Facebook Comments