అత్యంత భారీ బడ్జెట్ తో విపరీతమైన హైప్ తో రిలీజ్ అయి చివరికి చుట్టపు చూపుగా వారం రోజులు కూడా అతి కష్టంగా ఆడే సినిమాల మధ్య ఆది ‘చుట్టాలబ్బాయి’ మాత్రం చుట్టంలా కాకుండా ఏకంగా వినాయక చతుర్థి పండగ సంబరాలలో కూడా పాలు పంచుకుంటుంది. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్, దానికి తగ్గ నిర్మాణ విలువలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన చుట్టాలబ్బాయి విజయవాడ, వైజాగ్ లలో రిలీజైన అన్ని సెంటర్ లలో ఇప్పటికీ హౌజ్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. చుట్టాలబ్బాయి సినిమా ఆది కరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఈ సినిమాకి తమన్ సంగీతం ప్రాణం పోస్తే, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ ఫైట్స్ ఆదిని కమర్షియల్ హీరోల జాబితాలోకి చేర్చింది. మొదటి సినిమానే అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించిన నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి కృషి నిజంగా అభినందనీయం.
This website uses cookies.