'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో సుదీప్ ఇప్పుడు 'హలో బాస్' మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. కన్నడలో విడుదలై సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన 'విష్ణువర్థన' చిత్రాన్ని 'హలో బాస్' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పి.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'హలోబాస్' తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
'ఈగ' సుదీప్, ప్రియమణి, భావన, సోనూ సూద్, ద్వారకేష్, జె.కార్తీక్, అరుణ్ సాగర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: హరికృష్ణ, సినిమాటోగ్రఫీ: రాజారత్నం, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: రవివర్మ, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.కుమార్.
This website uses cookies.