అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజన్ కె. కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్ కామెడీ చిత్రం కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అంజన్ కె. కళ్యాణ్ మాట్లాడుతూ...ఇటీవల విడుదలైన మా `అత్తారిల్లు` పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ట్రైలర్స్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక మా చిత్ర కథ విషయానికొస్తే.. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్ తో పాటు ఆడియన్స్ కి కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. బిజినెస్ పరంగా కూడా రెస్పాన్స్ బావుంది. ఇప్పటికే కొన్ని ఏరియాలు బిజినెస్ పూర్తైంది. ప్రజంట్ మంచి కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నెల 16న విడుదలవుతున్న మా చిత్రాన్నికూడా ఆదరిస్తారిని ఆశిస్తున్నా
అన్నారు.
సాయి రవి కుమార్ , అతిథి దాస్, అనస్తేశియ చప్రసోవ, నండూరి రాము, రాకేశ్ శర్మ, ఉదయ్ శరత్, జోజూ, ఆర్‌జె వంశీ రామరాజు, ఎక్కాల వినోద్ కుమార్, రాజేంద్ర పులి, రాజశేఖర్, మమత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్: మణిశర్మ, పాటలు: డెన్నిస్ నార్టన్, కెమెరా: శివశంకర వరప్రసాద్, డాన్స్: జోజూ, ఫైట్స్: రెబల్ మాస్టర్, కో-డైరెక్టర్: కరణం వి లోకనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యం.హెచ్.రెడ్డి, సమర్పణ: అక్షయ్-అశ్విన్, కో- ప్రొడ్యూసర్స్: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి. కె. కళ్యాణ్, కథ - స్క్రీన్‌ప్లే - నిర్మాత - దర్శకత్వం: అంజన్ కె. కళ్యాణ్.
This website uses cookies.