చిన్ని చిత్రాల్లో మా వైశాఖం ట్రెండ్ క్రియేట్ చేస్తుంది - నిర్మాత బి.ఎ.రాజు
'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి హిట్ చిత్రాల తర్వాతలేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో 'సూపర్‌హిట్' అధినేత బి.ఎ.రాజు, ఆర్.జె. సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'వైశాఖం'. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో ‘చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఆదివారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి మాట్లాడుతూ -వైశాఖంసినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ప్రాముఖ్యత ఉంది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సాంగ్స్ చిత్రీకరించే సమయంలో కజికిస్తాన్ లోని అక్కడి లోకల్ ప్రజలు తమకు తాముగా పాటలు వింటూ డ్యాన్సులు చేసేవారు. అక్కడి వారికే అంత కనెక్ట్ అవుతుందంటే మన ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. హీరో హరీష్, హీరోయిన్ సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. వసంత్ గారు అంత మంచి మ్యూజిక్ అందించారు. పాటల చిత్రీకరణను చూసిన ఆయన చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. రెండు రోజులు మినహా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. అల్రెడి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కలరింగ్ జరుగుతుంది. వైశాఖం టైటిల్ విన్న అందరూ చాలా మంచి ఫీల్ కు లోనవుతున్నారు. రేపు సినిమా చూసిన తర్వాత కూడా అదే అనుభూతికి లోనవుతారు.
అన్నారు.
చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెలలోచివరి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేస్తాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. మా బ్యానర్ లో గతంలో విడుదలైన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ సినిమాల తరహాలో ఈ చిత్రంలో లవ్, ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం వైశాఖం. మా బ్యానర్ లో విడుదలైన చిత్రాలన్నీ డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. మా సినిమాను తమిళం, హిందీలో విడుదల చేయాలని అందరూ అడుగుతున్నారు. కొత్త కథ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే మా వైశాఖం చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న చిత్రాల్లో మా వైశాఖం చిత్రం కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది
అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ -బి.ఎ.రాజుగారికి, జయగారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. సినిమా బాగా వచ్చింది. వైశాఖం చిత్రం ఇంత బాగా రావడానికి కారణం జయగారు, రాజుగారే కారణం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది
అన్నారు.
కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ - ఆర్.జె.సినిమాస్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి. అలాగే ఇప్పుడు రానున్న వైశాఖం చిత్రం కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. నిర్మాత రాజుగారు సినిమాకు సంబంధించిన అన్నీ విషయాలను వెంటనే సమకూరుస్తున్నారు. వసంత్ గారి సంగీతం, సుబ్బారావుగారి సినిమాటోగ్రపీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది
అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ - సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జయగారు ఎడిటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. సినిమాను నవంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం
అన్నారు.
డి.జె.వసంత్ మాట్లాడుతూ - అందరూ ఇష్టపడి, కష్టపడి చేస్తున్న చిత్రం. లవ్, ఎంటర్ టైన్మెంట్, మెసేజ్ ఉన్న చిత్రం. నవంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం
అన్నారు.
ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ శివ,సుదర్శన్, భద్రమ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, లతీష్, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.