శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై ఎ. నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్ నిర్మాతలుగా జి.ఎస్.వి. సత్యప్రసాద్ దర్శకత్వంలో దిలీప్(నూతన పరిచయం), పూనమ్ కౌర్, అక్షిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం 'ప్రణయం'. ఈ చిత్రం హైద్రాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు గుణ్ణం గంగరాజు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. నటుడు రఘబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...ముందుగా మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు జి.ఎస్.వి. సత్యప్రసాద్ మంచి కథ వినిపించడంతో వెంటనే చిత్రాన్ని నిర్మించేందుకు మేము సిద్ధమయ్యాము. ఈ చిత్రం ద్వారా దిలీప్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. వినాయకచవితి పండుగ అనంతరం షూటింగ్ స్టార్టయ్యి..ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. కె.యం. రాధాకృష్ణ గారి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ప్రేక్షకులు మా ఈ ప్రయత్నంను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము..అని అన్నారు.
దిలీప్, పూనమ్‌కౌర్, అక్షిత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కె.యం రాధాకృష్ణ, కెమెరా: రామ్‌కుమార్, మాటలు,పాటలు: డా||దేవవరపు నీలకంఠరావు, నిర్మాణ నిర్వాహణ: యం.డి. సలీమ్, నిర్మాతలు: ఎ. నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.ఎస్.వి. సత్యప్రసాద్
This website uses cookies.