Social News XYZ     

Pranayam movie launched

ప్రారంభమైన 'ప్రణయం'

Pranayam movie launched

శ్రీ విజయానంద్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎ. నరేందర్‌, విజయానంద్‌, సురేష్‌గౌడ్‌ నిర్మాతలుగా జి.ఎస్‌.వి. సత్యప్రసాద్‌ దర్శకత్వంలో దిలీప్‌(నూతన పరిచయం), పూనమ్‌ కౌర్‌, అక్షిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం 'ప్రణయం'. ఈ చిత్రం హైద్రాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు గుణ్ణం గంగరాజు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, నిర్మాత సి. కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. నటుడు రఘబాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...ముందుగా మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు జి.ఎస్‌.వి. సత్యప్రసాద్‌ మంచి కథ వినిపించడంతో వెంటనే చిత్రాన్ని నిర్మించేందుకు మేము సిద్ధమయ్యాము. ఈ చిత్రం ద్వారా దిలీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. వినాయకచవితి పండుగ అనంతరం షూటింగ్‌ స్టార్టయ్యి..ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. కె.యం. రాధాకృష్ణ గారి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ప్రేక్షకులు మా ఈ ప్రయత్నంను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము..అని అన్నారు.

 

దిలీప్‌, పూనమ్‌కౌర్‌, అక్షిత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కె.యం రాధాకృష్ణ, కెమెరా: రామ్‌కుమార్‌, మాటలు,పాటలు: డా||దేవవరపు నీలకంఠరావు, నిర్మాణ నిర్వాహణ: యం.డి. సలీమ్‌, నిర్మాతలు: ఎ. నరేందర్‌, విజయానంద్‌, సురేష్‌గౌడ్‌; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.ఎస్‌.వి. సత్యప్రసాద్‌

Facebook Comments