రైతుగా, అన్నదాతగా, రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా విజయకేతనం ఎగరవేసి విద్యాదానం గొప్పదనే సంకల్పంతో విద్యాదాతగా, అనంతలక్ష్మి పేరుతో ఇంజనీరింగ్ విద్యా సంస్థలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ఛైర్మన్ అనంతరాముడు తొలిసారిగా చిత్రరంగ ప్రవేశం చేయడం విశేషం. అనంతలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి తొలి చిత్రంగా అత్యున్నత సాంకేతిక విలువలు గల భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు రమేష్‌నాయుడు నిర్మాతగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నాటక రంగంలో ఎంతో అనుభవం గడించి, రాణించి వేల నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు స్వీకరించిన డి.వై.రఘురామ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి పోలూర్ ఘటికాచలం కథ, మాటలతో పాటు సంగీతాన్ని అందిస్తున్నారు.
నూతన హీరోహీరోయిన్లు నటించే ఈ సినిమాలో సీనియర్ నటులు నటించబోతున్నారు. త్వరలో సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేసి అక్టోబర్ ఫస్ట్‌వీక్‌లో చిత్రాన్ని ప్రారంభించనున్నారు.
ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బిక్కీ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వై.రఘురామ్, కథ, మాటలు-సంగీతం: పోలూర్ ఘటికాచలం,
సమర్పణ: ముళ్ళగూరు లక్ష్మీదేవి,
నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు,
స్కీన్‌ప్లే-దర్శకత్వం: జి.ఎల్.బి. శ్రీనివాస్.
This website uses cookies.