సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న `మాయా మాల్`
హోరా హోరీ
ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ సమర్పణలో వైష్ణవి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం మాయా మాల్
. ఇషా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్, పృథ్వీ, నాగినీడు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా....
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...లవ్ అండ్ హర్రర్ కామెడి థ్రిల్లర్‌గా రూపొందిన మా మాయా మాల్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఓ మాల్‌లో ప్రధానాంశంగా సాగే సినిమా. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. గతంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుగారి బ్యానర్‌లో పనిచేసిన గోవింద్ లాలం కొత్త కథనంతో ఈ చిత్రాన్ని చక్కగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. దిలీప్, ఇషా జంటగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్‌ల కామెడి చాలా హైలైట్‌గా నిలుస్తుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది.
ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందింస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మంచి టీంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ వినాయక చవితికి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 8న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. త్వరలోనే సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల చేసి ఈ సెప్టెంబర్ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
దిలీప్, ఇషా, సోనియా, దీక్షాపంత్, నాగినీడు, పృథ్వి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, కాశీవిశ్వనాథ్, శ్రవణ్, కల్కి తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీః దాశరధి శివేంద్ర, ఎడింటింగ్ః కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ః రమణ వంక, యాక్షన్ః విజయ్, నిర్మాతలుః కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోవింద్ లాలం.