కుమారి 18+' మోషన్ పోస్టర్ విడుదల
వై.సుధాకర్ సమర్పణలో సెన్సేషనల్ హిట్ మూవీస్, ఫిల్మ్ విల్లా స్టూడియోస్ అసోసియేట్స్ పతాకాలపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుమారి 18+'. మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యరామ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రాజ్‌కందుకూరి, మల్లిఖార్జున్‌రావులు విడుదల చేశారు. ఈ సందర్భంగా....
హీరో ఆదిత్యరామ్ మాట్లాడుతూ - ''దర్శకుడు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనపడతాను. హీరోయిన్ చక్కగా నటించింది. సహకారం అందించిన అందరికీ థాంక్స్'' అన్నారు.
సాయికిరణ్ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో టైలర్ రోల్ చేశాను. డిఫరెంట్ ఏజ్‌లో ఉండే నలుగురు అబ్బాయిలు, అందంగా ఉండే అమ్మాయిని ప్రేమిస్తారు. దర్శకుడు శ్రీసత్య కారణంగానే సినిమా బాగా వచ్చింది. అందరికీ థాంక్స్'' అన్నారు.
మాల్యి మల్హోత్రా మాట్లాడుతూ - ''ఆడిషన్‌లో నన్ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. ఈ సినిమాకు ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాను. ఒక మంచి పాత్రతో తెలుగు సినిమాకు పరిచయం కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''యూత్‌కు నచ్చే టైటిల్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
మల్లిఖార్జున్ మాట్లాడుతూ - ''దర్శకుడు శ్రీసత్య, నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో సినిమా చేస్తున్నారు. క్యూట్ లవ్‌స్టోరీ'' అన్నారు.
డైరెక్టర్ శ్రీ సత్య మాట్లాడుతూ - ''సినిమా అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. గేమ్‌లో ఎక్కువ మంది ఉంటేనే ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే ఈ సినిమాలో ఓ అమ్మాయి కోసం ఒక డాక్టర్, ప్రొఫెసర్, ట్రైలర్, స్టూడెంట్ ఇలా నలుగురు మధ్య ఎలాంటి పోటీ నెలకొందనేదే కథ. షూటింగ్ అంతా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ''సినిమా బాగా వచ్చింది. యూత్‌కు నచ్చే లవ్ ఎంటర్‌టైనర్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యరామ్, ఆలీషా ఫెరెర్, వెంకట్ రాజు, శ్రీసత్య, జ్యోతిసాగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్, సంగీతం: ప్రేమ్ ఎల్.ఎమ్., సాహిత్యం: శశి, నిర్మాణం: సెన్సేషనల్ హిట్ మూవీస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ సత్య.