Ame Athadaithe logo launched by Paruchuri Venkateswara Rao

పరుచూరి వెంకటేశ్వరరావు రిలీజ్‌ చేసిన 'ఆమె... అతడైతే' ఫస్ట్‌లుక్‌

ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌ హనీష్‌ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆమె.. అతడైతే'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని స్టార్‌ రైటర్‌ పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''ఆమె అతడైతే' టైటిల్‌ చాలా డిఫరెంట్‌గా వుంది. డైరెక్టర్‌ సూర్యనారాయణ చెప్పిన కాన్సెప్ట్‌ చాలా బాగుంది. పోస్టర్స్‌ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి. దర్శకుడు ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని విన్నాను. టైటిల్‌ ఎంత క్యూరియాసిటీగా వుందో.. సినిమా కూడా అదేవిధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తేవాలని కోరుకుంటూ దర్శకుడు సూర్యనారాయణకి మంచి బ్రేక్‌ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ - ''తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కుర్రాడు కలెక్టర్‌ కావాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నెరవేర్చాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. తన లక్ష్యం కోసం సిటీకి వచ్చిన ఆ కుర్రాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే డిఫరెంట్‌ పాయింట్‌తో ఫుల్‌లెంగ్త్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. డిఫరెంట్‌ టైటిల్‌తో కథకి యాప్ట్‌ అయ్యేవిధంగా ఈ సినిమా వుంటుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మా నిర్మాతలు మారుతీ ప్రసాద్‌, రాధాకృష్ణలు ఈ చిత్రాన్ని ఎంతో క్వాలిటీతో నిర్మించారు. క్లాసికల్‌ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్‌ లెవల్‌లో గుర్తింపు పొందిన హనీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. హనీష్‌ ఫెంటాస్టిక్‌గా నటించాడు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్‌ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యశో కృష్ణ కథకి తగ్గట్లుగా మంచి మ్యూజిక్‌ని అందించాడు. సుద్దాల అశోక్‌తేజ ఎక్స్‌లెంట్‌గా పాటల్ని రాశారు. మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఎడిటింగ్‌ సూపర్‌. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్‌ అయి దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ - ''ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో దర్శకుడు సూర్యనారాయణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం వుంటుంది. పరుచూరి వెంకటేశ్వరరావుగారు మా చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేయడం మాకు చాలా ఆనందంగా వుంది. యశోకృష్ణ సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో ఆడియో రిలీజ్‌ చేసి అదే నెలాఖరులో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

భానుచందర్‌, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: ఆరే. వెంకటేష్‌, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, కెమెరా: హను కాక, ప్రొడక్షన్‌ మేనేజర్‌: బి. నాగేశ్వరరావు,

నిర్మాతలు: ఎం. మారుతీప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ
కథ- స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: కె.సూర్యనారాయణ

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%