Social News XYZ     

Siddhartha Audio on September 2nd

సెప్టెంబ‌ర్ 2న `సిద్ధార్థ` ఆడియో విడుద‌ల‌

Siddhartha Audio on September 2nd

లంకాల బుచ్చిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో సాగ‌ర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌద‌రి హీరో హీరోయిన్లుగా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కె.వి.ద‌యానంద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం సిద్ధార్థ‌. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకున్నాయి. సెప్టెంబ‌ర్ 2న ఆడియో విడుద‌ల కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ...

దాస‌రి కిర‌ణ్‌కుమార్ మాట్లాడుతూ మంచి టీంతో చేస్తున్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సిద్ధార్థ‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విస్సుగారు అందించిన సూప‌ర్బ్ క‌థ‌లో మంచి ఎంట‌ర్ టైనింగ్‌తో పాటు ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్‌కు త‌గిన విధంగా సాగ‌ర్ ఎక్సలెంట్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. సినిమాలో కంటెంట్‌కు త‌గిన విధంగా పరుచూరి బ్ర‌ద‌ర్స్ అద్భుత‌మైన డైలాగ్స్ అందించారు. మెలోడి బ్ర‌హ్మ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తున్నాం. ఈ కార్యక్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లోనే మూవీని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు

 

సాగ‌ర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కోట‌శ్రీనివాస‌రావు, అజ‌య్, సుబ్బ‌రాజు, స‌త్యం రాజేష్‌, తాగుబోతు రమేష్‌, ప్ర‌భాస్ శ్రీను, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి క‌థః విస్తు, డైలాగ్స్ః ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, ఆర్ట్ః వివేక్ అన్నామ‌లై, ఫైట్స్ః సాల్మ‌న్‌, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కొరియోగ్ర‌ఫీః హారీష్ పాయ్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్ పూడి, సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, స‌హ నిర్మాతః ముత్యాల ర‌మేష్‌, నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః కె.వి.ద‌యానంద్ రెడ్డి.

Facebook Comments