''పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా ఈ సినిమాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రశ్నించడానికి, వాళ్ళకి న్యాయం చెయ్యడానికి 'ఒక్కడొచ్చాడు'. అదే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వుండే ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ వుంటూనే ఒక పవర్‌ఫుల్, పర్పస్‌ఫుల్ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది. దర్శకుడు సురాజ్ ఈ స్టోరీ లైన్ చెప్పగానే ఇమ్మీడియట్‌గా అన్ని సినిమాలూ ఆపి ఇదే ముందు స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. అంతగా ఈ కథకు నేను కనెక్ట్ అయ్యాను. ఇందులో ఒక కొత్త పాయింట్ వుంది. అది అన్ని ఊళ్ళల్లో అందరూ నిత్యం ఫేస్ చేసేదే. ఆ పాయింట్ చుట్టూ అల్లిన మంచి కమర్షియల్ సినిమా ఇది. ఇందులో నా లుక్, క్యారెక్టరైజేషన్ ఇంతకుముందు సినిమాలన్నింటి కంటే డిఫరెంట్‌గా వుంటుంది. తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు. తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ బర్త్‌డేకి
'ఒక్కడొచ్చాడు' షూటింగ్‌లో వుండడం నాకు ఎంతో ఆనందంగా వుంది. నామనసుకి నచ్చిన సినిమా షూటింగ్‌లో నా బర్త్‌డే జరుపుకోవడం నిజంగా రియల్ హ్యాపీ బర్త్‌డేగా ఫీల్ అవుతున్నాను. దీపావళి కానుకగా వచ్చే 'ఒక్కడొచ్చాడు' డెఫినెట్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకొని నా కెరీర్‌లో మరో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందని నా నమ్మకం. సెప్టెంబర్ 12 నుండి మిస్కిన్ డైరెక్షన్‌లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మరో చిత్రం ప్రారంభిస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' తెలుగులో జి.హరి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది'' అన్నారు ఆగస్ట్ 29 తన బర్త్ డే సందర్భంగా 'ఒక్కడొచ్చాడు' సినిమా విశేషాలను తెలియజేస్తూ మాస్ హీరో విశాల్.
మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం
'ఒక్కడొచ్చాడు' ప్రోగ్రెస్ గురించి నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, అద్భుతమైన మ్యూజిక్‌లతో పాటు ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం ఇది. సెప్టెంబర్ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. విశాల్ బర్త్‌డే ఆగస్ట్ 29 సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేస్తున్నాం. కోటి 50 లక్షల వ్యయంతో కనల్ కణ్ణన్ సారధ్యంలో తీసిన ఛేజ్ ఈ సినిమాకి ఓ హైలైట్. అలాగే విశాల్, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో తీసిన పాట స్పెషల్ ఎట్రాక్షన్. హీరోయిన్ తమన్నాకి మరో హీరోయిన్ శృతిహాసన్ పాట పాడడం మరో విశేషం'' అన్నారు.
విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.
This website uses cookies.